హోం మంత్రిత్వ శాఖ
చట్టాల ఉల్లంఘనకు మానవ హక్కులు సాకు కాకూడదు
Posted On:
29 SEP 2020 6:37PM by PIB Hyderabad
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీసుకున్న వైఖరి, చేసిన ప్రకటన దురదృష్టకరం, వాస్తవదూరం. ఇవీ వాస్తవాలు:
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం కింద ఇరవయ్యే:ళ్ళ కిందట ఒకే ఒక్కసారి 19.12.2000న అనుమతి వచ్చింది. అప్పటినుంచి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వరుసగా అన్ని ప్రభుత్వాలూ అది చట్ట ప్రకారం అనర్హమైనది గనుక అనుమతి మంజూరు చేయలేదు.
అయితే, ఎఫ్ సి ఆర్ ఎ నిబంధనలను పక్కదారిపట్టించేందుకు ఆమ్నెస్టీ యుకె భారత్ లో రిజిస్టర్ చేసుకున్న నాలుగు సంస్థలకు పెద్దమొత్తాల్లో డబ్బు ఇచ్చింది. దానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే పేరు పెట్టింది. ఎఫ్ సి ఆర్ ఎ నిబంధనల ప్రకారం భారత హోం మంత్రిత్వశాఖ ఆమోదం పొందాల్సి ఉన్నా, అదేమీ లేకుండా చెప్పుకోదగినంత పెద్దమొత్తాన్ని ఆమ్నెస్టీ ఇండియా సంస్థకు కూడా ఇచ్చింది. దురుద్దేశపూర్వకంగా ఇలా నగదు తరలింపు చేయటం భారత చట్టాలని ధిక్కరించటమే.
ఆమ్నెస్టీ చెస్తున్న ఇలాంటి చట్టవిరుద్ధమైన విధానాల కారణంగా గత ప్రభుత్వం కూడా ఆమ్నెస్టీ విదేశీ నిధులు అందుకోవటానికి పదే పదే చేసిన విజ్ఞప్తులను త్రోసిపుచ్చింది. దీనివలన ఆమ్నెస్టీ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఆమ్నెస్టీ పట్ల వివిధ ప్రభుత్వాలు ఈ చట్టబద్ధమైన వైఖరి అవలంబించటాన్ని బట్టి చూస్తే, తన కార్యకలాపాల కోసం నిధులు పొందటానికి ఆమ్నెస్టీ అనుసరించిన వివాదాస్పద వైఖరిలోనే మొత్తం తప్పంతా ఉందని స్పష్టమవుతోంది.
మానవతావాద కార్యక్రమాలు చేపడుతున్నట్టు, వాస్తవాలు మాట్లాడుతున్నట్టు ఆకర్షణీయమైన ప్రకటనలు చేయటం కొన్నేళ్ళుగా భారతదేశంలోని చట్టాలను ఉల్లంఘిస్తూ, ఆ అక్రమ కార్యకలాపాల నుండి అందరి దృష్టినీ మరల్చటానికే ఈ ప్రయత్నమన్నది సుస్పష్టం. అలాంటి ప్రకటనలు కేవలం వివిధ దర్యాప్తు సంస్థలు జరుపుతున్న దర్యాప్తులను ప్రభావితం చేసే ప్రయత్నమే.
అనేక ఇతర సంస్థలలాగానే భారత్ లో మానవతావాద కార్యక్రమాలు స్వేచ్చగా చేపట్టటానికి ఆమ్నెస్టీకి ఎలాంటి అవరోధమూ లేదు. అయితే విదేశీ నిధులతో పనిఒచేసే సంస్థలు ఈ దేశ అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకోవటాన్ని ఇక్కడి చట్టాలు అంగీకరించవు. ఈ చట్టం అందరితోబాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు కూడా వర్తిస్తుంది.
భారత ప్రజాస్వామ్యం చాలా విస్తృతమైనది. స్వేచ్ఛాయుతమైన మీడియాకు ఇక్కద అవకాశముమ్ది. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంది. అన్ని విషయాలమీద చురుకైన చర్చ జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం మీద భారత ప్రజలు కనీవినీ ఎరుగనంత నమ్మకముంచారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకోవటంలో విఫలమైన ఆమ్నెస్టీ, భారత ప్రజాస్వామ్యం మీద వ్యాఖ్యానించేందుకు అర్హమైనది కాదు.
***
(Release ID: 1660193)
Visitor Counter : 285