రైల్వే మంత్రిత్వ శాఖ
యూజర్ డిపో మాడ్యూల్‌ను ప్రారంభించిన భారతీయ రైల్వే
పనులన్నీ మాన్యువల్ నుంచి వాస్తవ సమయంలో జరిగేలా డిజిటలీకణ; సంబంధిత వర్గాల మధ్య ఆన్‌లైన్‌లో సమాచార మార్పిడికి వీలు
యూజర్ డిపోలు సహా పంపిణీ గొలుసు సంపూర్ణ డిజిటలీకరణకు మార్గం
Posted On:
28 SEP 2020 5:59PM by PIB Hyderabad
పశ్చిమ రైల్వేలోని అన్ని యూజర్ డిపోల్లో, 'యూజర్ డిపో మాడ్యూల్' (యూడీఎం) ప్రారంభమైంది. దీనిని 'సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం' (సీఆర్‌ఐఎస్) అభివృద్ధి చేసింది.
అన్ని రైల్వే జోన్లలో త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేస్తారు. స్టోర్స్ డిపోల వరకు రైల్వే పంపిణీ గొలుసును డిజిటలీకరించినా, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు మాన్యువల్‌గానే జరుగుతున్నాయి. కొత్త పద్ధతి, కార్యకలాపాలన్నింటినీ మాన్యువల్ నుంచి వాస్తవ సమయంలో జరిగేలా డిజిటలీకరించి గొప్ప మార్పును తెస్తుంది. సంబంధిత వర్గాల మధ్య ఆన్‌లైన్ ద్వారా సమాచార మార్పిడికి వీలు కల్పిస్తుంది. యూజర్ డిపోలు సహా, పంపిణీ గొలుసు పూర్తి డిజిటలీకరణకు మార్గం సుగమం అవుతుంది.
ఆస్తుల మెరుగైన నిర్వహణతోపాటు, ఆర్థిక ప్రయోజనం, సమర్థత, పారదర్శకతను కొత్త విధానం తెస్తుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు, సంతృప్తిని అందిస్తుంది.
*****
(Release ID: 1659922)
Visitor Counter : 239