ఆర్థిక మంత్రిత్వ శాఖ

జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో ఆదాయంపన్ను శాఖ సోదాలు

Posted On: 26 SEP 2020 5:56PM by PIB Hyderabad

   జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించే ఒక ప్రముఖ గ్రూపునకు చెందిన కంపెనీ వాణిజ్య కార్యాలయాల, నివాస సముదాయాలపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపింది. దాదాపు 20 నివాస, వాణిజ్య ప్రాంతాల్లో 2020 సెప్టెంబరు 25 అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ సరుకుల వాణిజ్యం, వనస్పతి నెయ్యి, రియల్ ఎస్టేట్, తేయాకు ఎస్టేట్లు వంటి వాటిల్లో గ్రూపు వ్యాపారం సాగిస్తూ వస్తోంది. గ్రూపునకు  కోల్కతాలో రియల్ ఎస్టేటు ప్రాజెక్టులు ఉన్నాయి

   ఖాతా పుస్తకాలకు సంబంధం లేకుండానే కంపెనీ నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన సాక్యాధారాలు, లెక్కల్లో లేని నగదు ఖర్చులు, అడ్వాన్సుగా తీసుకున్న నగదు, నగదుపై చెల్లించిన వడ్డీ వంటివి బయటపడ్డాయి. షెల్ కంపెనీల గ్రూపునకు పంపించిన నగదు, రియల్ ఎస్టేట్ కంపెనీకి రుణంగా అందించిన నగదు సోదాల్లో బయటపడింది.

  చాలా వరకు కంపెనీల్లో ,..కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉంటున్నారు. వారికి వాస్తవంగా ఎలాంటి వ్యాపారం లేదు. ఆదాయం పన్ను రిటర్న్ వివరాలను కొన్నింటిని మాత్రమే సమర్పించారు.

     అలాంటి ఒక కంపెనీ, 7కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిపినట్టు లెక్కల్లో చూపించినప్పటికీ  సదరు కంపెనీకి 2014నుంచి ఎలాంటి వ్యాపారం లేదని తేలింది. నగదును మాత్రం కోల్కతాలోని బ్యాకు ఖాతాల్లో జమచేశారు. అమ్మకం వివరాలను మాత్రం జార్ఖండ్ కు చెందిన కొనుగోలుదార్ల ఖాతా పుస్తకాల్లో చూపించారు.

    సోదాల సందర్భంగా హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లు, చేతి రాతతో కూడిన డైరీలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారునగదు రూపంలో రుణం తీసుకున్నట్టు, ఇచ్చినట్టు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో స్థలాన్ని బుక్ చేసినందుకుగాను నగదు అందుకున్నట్టు చేతిరాత డైరీలు కొన్నింటిలో నమోదు చేశారు. ఖాతా పుస్తకాలతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్లకు నగదు చెల్లింపు జరిపినట్టు, డమ్మీ కాంట్రాక్టర్లకు నకిలీ చెల్లింపులు జరిగినట్టు కూడా సోదాల్లో బయటపడింది. పుస్తకాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విలువను, దాని అసలు విలువకంటే చాలా తక్కువ చేసి చూపించినట్టు తేలింది. ఒక నిర్మాణంకోసం చేసిన నగదు ఖర్చును రికార్డు పుస్తకాలతో సంబంధం లేకుండా చేసినట్టు కూడా తేలింది

       ప్రాథమిక అంచనాల ప్రకారం,..రూ. 40కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్టు సోదాల్లో సాక్ష్యాధారాలు బయటపడ్డాయిరియల్ ఎస్టేటు ప్రాజెక్టుకు సంబంధించి అడ్వాన్సుగా చెల్లించిన రూ. 80కోట్లకు సంబంధించి ఇంకా పరిశీలన కొనసాగుతోంది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

***


(Release ID: 1659455) Visitor Counter : 136