ఆయుష్

న్యూట్రిషన్ సైన్స్ అభివృద్ధిపై జాతీయ వెబినార్ నిర్వహించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

Posted On: 25 SEP 2020 12:58PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ "ఆయుష్ ఫర్ ఇమ్యునిటీ" ప్రచారంలో భాగంగా, పోషన్ అహార్ పేరుతో న్యూట్రిషన్ సైన్స్, అభివృద్ధిపై వెబి‌నార్ ను  ఇటీవల నిర్వహించారు. వెబి‌నార్‌లో నిపుణులు, పరిశోధకులు, క్లినికల్ న్యూట్రిషనిస్టులు, సర్జన్లు, యోగా & నేచురోపతి వైద్యులు పాల్గొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అటానమస్ బాడీ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా & నేచురోపతి (సిసిఆర్వైఎన్) ఈ వెబి‌నార్‌ను నిర్వహించింది. 

మొదటి సెషన్ అమెరికాలోని నార్త్ డకోటా ప్లాంట్ సైన్స్ కి చెందిన ప్రొఫెసర్ కాళిదాస్ శెట్టి, స్వదేశీ ఆహార పదార్థాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. అనుసరణలు సాధ్యమే అయినప్పటికీ మన ఉనికికి జీవావరణ శాస్త్రం యొక్క సహకారాన్ని విస్మరించలేము. పర్యావరణ దృక్పథంలో, స్వదేశీ ఆహారాలను ఆరోగ్య నిర్వహణకు అవసరమైన ఆహార గొలుసు వ్యవస్థలోకి తిరిగి తీసుకురావాలి, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న ఆహారాన్ని నిరోధించాలి.

యుకెలోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ నుండి న్యూట్రిజెనోమిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విమల్ కరణి జన్యుశాస్త్రం నుండి జన్యు వైవిధ్యం, జన్యు హాని  నుండి వ్యాధి హాని  వరకు అనేక రకాల పోషకాహార సూత్రాలను తెలియజేశారు. . వ్యక్తిగత ఆహారం ప్రాముఖ్యత, వ్యాధుల నివారణకు జీవనశైలిలో తేవాల్సిన మార్పులు గురించి వివరించారు. నిట్టే కెఎస్ హెగ్డే మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ జాకబ్ మన వాతావరణ పరిస్థితులు, మన ఆహారపు అలవాట్లకు మరియు వ్యాధుల ప్రారంభానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ క్లినికల్ న్యూట్రిషన్ హెడ్ డాక్టర్ ఎస్తేర్ సత్యరాజ్ చేత పోషకాహార విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన ఆహారం ఎంపికలపై మరో ముఖ్యమైన సెషన్ జరిగింది.

***



(Release ID: 1659191) Visitor Counter : 121