ఆయుష్
కోవిడ్ -19 నియంత్రణలో వస, తిప్పతీగ(గుడుచి) ఉపయోగంపై క్లినికల్ అధ్యయనం చేపట్టనున్న ఆయుష్ మంత్రిత్వశాఖ
Posted On:
25 SEP 2020 1:16PM by PIB Hyderabad
కోవిడ్ -19 నియంత్రణకుగల అవకాశాలపై ఆయుష్ మంత్రిత్వశాఖ వివిధ పరిష్కారాలను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధఙంచి అవకాశం ఉన్న పలు పరిష్కారాలను అణ్వేషిస్తోంది. ఇందులో భాగంగా వసఘన, గుడుచి ఘన, వస-గుడిచి ఘనలు కోవిడ్ నియంత్రణలో ఏమేరకు ప్రభావంచూపుతాయన్న దానిని అంచనావేసేందుకు కోవిడ్ -19 పాజిటివ్ కేసులలో దీనిని వాడేందుకు వీటిని ఇటీవల అనుమతించారు. ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ)న్యూఢిల్లీ, సిఎస్ఐఆర్ విభాగమైన ఐజిఐబి కొలాబరేషన్‌తో నిర్వహిస్తోంది.
ఇందుకు సంబంధించిన సవివరమైన విధానం, ఫలితాల అంచనా, క్లినికల్, లేబరెటరీ ప్రమాణాలు, రిసెర్చ్‌కి అవసరమైన సదుపాయాలు వంటి వాటిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ అధ్యయనం ప్రత్యేకమైన కేస్ రిపోర్ట్‌ఫోరమ్ (సిఆర్ఎఫ్)ను వినియోగిస్తుంది. ఇది ఆయుష్ విధాన పరిశోధనకు సరిపోతుంది. సిఆర్ఎఫ్, స్టడీ ప్రొటోకాల్‌లను వివిధ రంగాలకు చెందిన నిపుణులు పరిశీలించారు. ఇందులో ఆధునిక వైద్యనిపుణులు కూడా ఉన్నారు. వారి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు.ఈ అధ్యయనాన్ని సంస్థాగత విలువల కమిటీ (ఐఇసి) అనుమతుల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్టు కింది ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
మోనో హెర్బల్ ఫార్ములేషన్లైన వస, తిప్పతీగ(గుడుచి)ల సమర్ధత, అవి ఏరకంగా పనిచేస్తాయన్నదానిని అలాగే వస-గుడుచి నుంచి తీసిన పదార్ధం సార్స్ సిఒవి-2 పాజిటివ్ లక్షణాలు కలిగిన వారిపైన లేదా తేలికపాటి లక్షణాలు కలిగిన వారిపైన ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది పరిశీలిస్తారు. వైరస్ వ్యాప్తి వేగాన్ని నియంత్రించడంలో ఇవి ఏ మేరకు ప్రభావం చూపుతాయో పరిశీలిస్తారు.
ఈ పాలీహెర్బల్, లేదా మోనో హెర్బల్ ఫార్ములేషన్లు కోవిడ్ -19 కు సంబంధించి కీలక బయోమార్కర్లలో ఏవైనా మార్పులు చేయగలుగుతాయా అన్నది గమనిస్తారు.
భారతీయ వైద్య సంప్రదాయంలో వస, తిప్పతీగ (గుడుచి)లకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో వినియోగిస్తుంటారు. అందువల్ల ప్రస్తుత అధ్యయనం పై మొత్తం ఆయష్ రంగం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తోంది.
***
(Release ID: 1659186)
Visitor Counter : 284