పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనంతర రికవరీ ప్రణాళికలో ప్రకృతికి ప్రాధాన్యం ప్రపంచ దేశాలకు భారత్ సూచన
Posted On:
24 SEP 2020 7:51PM by PIB Hyderabad
నియంత్రణలేని తీరులో ప్రకృతి వనరుల దుర్వినియోగం, విచ్చలవిడి ఆహారపు అలవాట్ల కారణంగా మానవుల జీవితాలకు అండగా నిలిచే ప్రాకృతిక వ్యవస్థ విధ్వంసానికి గురైనట్టు కోవిడ్-19 మహమ్మారి వైరస్ దాడితో తేటతెల్లమైందని, ప్రస్తుత విపత్కర పరిస్థితినుంచి కోలుకొనేందుకు మనం చేపట్టే రికవరీ ప్రణాళికలో ప్రకృతి ప్రధాన భాగం కావాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. “ఐక్యరాజ్యసమితి క్రియాశీలక దశాబ్ది - సుస్థిర అభివృద్ధి సాధన” కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రకృతికి ప్రాధాన్యం ఇచ్చేందుకు సంసిద్ధం కావాలని ఆయన కోరారు. “2020 తర్వాత జీవవైవిధ్యం: భూమిపై అన్ని జీవరాసుల భాగస్వామ్యంతో భవిత నిర్మాణం” అన్న అంశంపై చైనా ఆతిథ్యంలో జరిగిన మంత్రుల స్థాయి వర్చువల్ రౌండ్ టేబుల్ చర్చాగోష్టిలో భారత్ తరఫున ప్రకాశ్ జవదేకర్ ప్రాతినిధ్యం వహించారు. జీవ వైవిధ్య పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి అంశంపై ఐక్యరాజ్యసమితి నిర్వహించనున్న శిఖరాగ్ర సమావేశానికి వారం రోజులు ముందుగా ఈ చర్చా గోష్టి జరిగింది. తగిన ప్రాంతీయ ప్రాతినిధ్యం కలిగిన 15 మంది మంత్రుల స్థాయి ప్రతినిధులు, సంబంధిత అంతర్జాతీయ సంస్థల అధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చర్చాగోష్టిలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, జీవ వైవిధ్య పరిరక్షణలో భారతదేశం ఇప్పటికే నాయకత్వ పాత్ర పోషిస్తూ వస్తోందని, వాతావరణ, పర్యావరణ పరిరక్షణపై ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రెండు సమ్మేళనాలను కాన్ఫరెన్స్ పార్టీస్ (కాప్) సదస్సుల పేరిట భారతదేశం నిర్వహించిందని అన్నారు. భూమిని మరుభూమిగా మార్చే కార్యకలాపాలకు వ్యతిరేకంగా 2019, సెప్టెంబరులో ఒక కాప్ సదస్సును, వలస జీవజాతుల పరిరక్షణ పేరిట 2020 ఫిబ్రవరిలో మరో కాప్ సదస్సును భారత్ నిర్వహించిందన్నారు. భారతదేశం 2.4శాతం భూభాగ విస్తీర్ణంలో దాదాపు 18శాతం మానవ జనాభా, పశువుల జనాభాకు ఆవాసం కల్పిస్తున్నప్పటికీ, 8శాతం జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయని, సుమారు 25శాతానికి అటవీ ప్రాంతాన్ని పెంపొందించ గలిగామని జవదేకర్ తెలిపారు. 2.6కోట్ల హెక్టార్ల బంజరు భూమిని భూసారంతో పునరుద్ధరించాలని భారత్ సంకల్పించిందని, 2030 నాటికి ఇది సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
విభిన్న జాతుల జనాభాకు కేంద్రమైన భారతదేశంలో జీవవైవిధ్య పరిరక్షణా నిర్వహణకు పటిష్టమైన న్యాయబద్ధమైన సంస్ధాగత వ్యవస్థ ఉందని, ఈ వ్యవస్థకు దేశవ్యాప్తంగా 2.50లక్షల జీవవైవిధ్య నిర్వహణా కమిటీలు అనుసంధానమై ఉన్నాయని, జీవవైవిధ్య పరిరక్షణలో స్థానికులకు అవి భాగస్వామ్యం కలిస్తూ వస్తున్నాయని అన్నారు. జీవవైవిధ్య గణాంకాలను నమోదు చేయడానికి లక్షా 70వేల రిజిస్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
జీవవైవిధ్యంపై ప్రపంచ దృక్పథం పేరిట తాము ఇటీవల ఒక నివేదికను కూడా విడుదల చేసిన నేపథ్యంలో, ప్రకృతి పరిరక్షణకోసం ఏ అవకాశాన్నీ వదల దల్చుకోలేదని, అందరితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. 2020 అనంతరం ప్రపంచ స్థాయి జీవవైవిధ్య పరిరక్షణ వ్యవస్థ ఖరారు కోసం చైనాలోని కున్మింగ్ లో వచ్చే ఏడాది జరగనున్న కాప్ సదస్సు ప్రకృతి రక్షణలో ప్రపంచ దేశాలకు మరో వినూత్న అవకాశం కల్పించగలదని భారత్ విశ్వసిస్తున్నట్టు జవదేకర్ చెప్పారు.
***

(Release ID: 1658939)
Visitor Counter : 249