ఆయుష్
ఆయుష్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో 8000 మందితో కొచ్చిలో ఈ-మారథాన్
Posted On:
24 SEP 2020 7:19PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వశాఖ చేపట్టిన మూడు నెలల ప్రచారోద్యమం “ రోగనిరోధకతకు ఆయుష్” లో భాగంగా ఇప్పుడు వినూత్నమైన ఈ-మారథాన్ కు చేయూతనిస్తోంది. కేరళలోని కొచ్చి నగరంలో ఉన్న రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, రాజగిరి బిజినెస్ స్కూల్ నిర్వహించే మారథాన్ లో మంత్రిత్వశాక కూడా పాలుపంచుకుంటోంది. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలమీద, ముందస్తు జాగ్రత్తలమీద దృష్టి సారిస్తూ ఈ ఉద్యమం సాగుతోంది. టెక్నాలజీని, వ్యాయామంతో కూడిన పరుగును, విరాళాన్ని, ఆరోగ్య సంక్షేమాన్ని కలగలుపుతూ ఈ-ఈవెంట్ ద్వారా ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు రాబట్టాలని యోచిస్తున్నారు.
కోవిడ్ బాధితులైన పిల్లల చదువులకు మద్దతుగా, ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఇందులో పాల్గొంటున్న వారందరి మేలు కోరుకుంటూ ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. “కరోనా సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని పునరుత్తేజితం చేయండి” అనే అంశం ఆధారంగా చేపట్టారు.
అన్ని వయోవర్గాలు, అన్ని ప్రాంతాల వారి మానసిక సంక్షేమాన్ని పెంచి ప్రోత్సహించటం కోసం రాజగిరి ఈ-మారథాన్ రూపకల్పన చేశారు. ఇందులో పాల్గొనదలచినవారు తమకు అనుకూలమైన సమయంలో సురక్షితమైన ప్రదేశాలనుంచి పాల్గొనవచ్చు. ఈ పరుగు సవాలు పూర్తి చేయటానికి సుదీర్ఘమైన పది రోజుల సమయం ఉంటుంది. ఒక వెల్ నెస్ యాప్ ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరుగు వివరాలను సెంట్రల్ సర్వర్ లో నిక్షిప్తం చేస్తుంది. ఆ విధంగా ఇందులో పాల్గొన్నవారందరూ కేంద్రీకృత సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ద్వారా అనుసంధానమవుతారు.
పాల్గొన దలచినవారు తమ పేర్లను emarathon.rajagiri.edu వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా ముందుకెళ్లాలో వాళ్లకు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందుతుంది. వాళ్లెవరూ ఈ ఈవెంట్ కోసం ఫిట్ నెస్ యాప్ ఏదీ కొనాల్సిన అవసరం ఉండదు. అయితే, రేస్ లో పాల్గొనే సమయంలో వెంట స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళటం గాని, లేదా ఫిట్ నెస్ బాండ్ ధరించటం గాని చేయాలి.
2020 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10 వరకు ఇందులో పాల్గొనవచ్చు. రోగనిరోధకత కోసం ఆయుష్ ప్రచారం ముగింపు రోజైన విహార తో పూర్తవుతుంది. ఇది అక్టోబర్ నెలంతా నడుస్తుంది. భౌతిక దూరం పాటిస్తూనే సామాజికంగా దగ్గరవటాన్ని ఈ ఈవెంట్ ప్రబోధిస్తుంది.క్షేమం కోసం అవసరమైన యోగ, ధ్యానం, వెబినార్స్, ఎంటర్టైన్మెంట్ ఇందులో కలగలిసి ఉంటాయి. ఈవెంట్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కోవిడ్ లో తల్లిదండ్రులను కోల్పోయిన 50 మంది పిల్లలకోసం విరాళంగా ఇస్తారు. సుమారు 8,000 మంది ఇందులో పాల్గొంటారని అంచనావేస్తున్నారు.
***
(Release ID: 1658875)
Visitor Counter : 207