రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే అతి ఎత్తులోని పొడవైన షిన్‌కున్ లా సొరంగం డీపీఆర్ పనిని వేగవంతం చేసిన ఎన్‌హెచ్ఐడీసీఎల్
- ఈ సొరంగం మనాలి-కార్గిల్ జాతీయ రహదారి మొత్తం ఏడాది పొడవునా అందుబాటులో ఉండేందుకు దోహదం చేస్తుంది
Posted On:
23 SEP 2020 1:32PM by PIB Hyderabad
రహదారి, రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'నేషనల్ హైవేస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఎన్‌హెచ్ఐడీసీఎల్) ప్రపంచంలోనే అతి ఎత్తులోని పొడవైన షిన్‌కున్ లా సొరంగం (13.5 కిలోమీటర్ల పొడవు) నిర్మాణానికి సంబంధించి 'వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్' (డీపీఆర్) పనులను వేగవంతం చేసింది. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలోని అప్రోచ్ రోడ్లతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ సొరంగం నిర్మాణం పూర్తయితే మనాలి - కార్గిల్ రహదారి ఏడాది పొడవునా తెరిచి ఉంచేందుకు దోహదం చేస్తుంది. లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీ మరియు దాని లభ్యతను మెరుగుపరచడానికి సమగ్ర దృక్పథాన్ని తీసుకోవటానికి గాను.. ఎన్‌హెచ్ఐడీసీఎల్ యొక్క సీనియర్ అధికారుల బృందం, సంస్థ ఎండీ శ్రీ కె కె పాథక్ నేతృత్వంలో ఎంతగానో కృషి చేసింది. కె.కె. పాథక్ బృందం రెండు రోజుల పాటు లే నుండి ఉత్తరం వైపు మరియు షింకు లా సొరంగం యొక్క దక్షిణ పోర్టల్స్ వరకు పాడుమ్ ద్వారా రెండు రోజుల పాటు ప్రయాణించారు. రోజుకు దాదాపు 12 గంటల పాటు వీరు ప్రయాణించారు. లద్ధాఖ్ సెక్టార్‌లో దాదాపు ఐదు రోజుల పర్యటన సందర్భంగా, బృందం షిన్‌కున్ లా సొరంగం యొక్క ఉత్తర మరియు దక్షిణ పోర్టల్స్ ను సందర్శించింది. డీపీఆర్ కన్సల్టెంట్స్ ఈ ప్రదేశంలో జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పనుల పరిశీలన సమయంలో శ్రీ పాథక్ పోర్టల్ ప్రాంతంలో ప్రాజెక్టు పనుల్ని మరింత వేగవంతం చేయాలని నొక్కి చెప్పారు. ఈ ప్రాంతం చాలా భారీ హిమపాతాలు సంభవించే అనుభవాలు ఉన్నందున శీతాకాలం ప్రారంభమయ్యే ముందుగానే అంటే అక్టోబర్ 15 నాటికి వీటని పూర్తి చేయాలని సూచించారు. మారుమూల మరియు ప్రాప్యత చేయలేని లద్ధాఖ్, లాహాల్ & స్పితి జిల్లాలోని ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎన్‌హెచ్ఐడీసీఎల్ చేస్తున్న కృషిని సైట్‌లో ఉన్న స్థానికులు ఈ సందర్భంగా ప్రశంసించారు.
***
(Release ID: 1658202)
Visitor Counter : 149