శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

విజ్ఞాన శాస్త్రం లో మహిళల భాగస్వామ్యం మరియు నాయకత్వం యొక్క ముఖ్య సమస్యలను పరిష్కరించే మార్గాలపై ఎస్.టి.ఐ.పి. లో నిపుణులు చర్చించారు.

Posted On: 22 SEP 2020 1:46PM by PIB Hyderabad

విజ్ఞాన శాస్త్రంలో భారతీయ మహిళలు తక్కువ శాతంలో ఉండడం గురించి, లింగ అంతరం గురించి,  ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రంలో మహిళా నాయకుల పరంగా మరియు కొత్త శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల విధానం ఎస్.టి.ఐ.పి.-2020 లో వాటిని పరిష్కరించే పద్ధతుల గురించి, ఇటీవల నిర్వహించిన, ఎస్.టి.ఐ.పి-2020 సమాచార సదస్సులో విస్తృతంగా చర్చించారు.  ఎస్.టి.ఐ.పి.-2020 సచివాలయం బృందం తో పాటు మహిళా శాస్త్రవేత్తలు మరియు విజ్ఞాన శాస్త్రానికిచెందిన ఔత్సాహికులు ఈ చర్చలో పాల్గొన్నారు. 

చర్చకు అధ్యక్షత వహించిన "విభా" (విజ్ఞానభారతి) అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భట్కర్, మహిళలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే సుస్థిరత, ఆత్మ నిర్భారత సాధ్యమవుతాయని నొక్కి చెప్పారు.  మహిళా ఆవిష్కర్తలను పెంపొందించడానికి తక్కువ సంస్థాగత యంత్రాంగం పరంగా అనేక సమస్యలు, వయస్సు అవరోధ సమస్యలు, లీకైన పైప్ ‌లైన్, మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలకు నిధులు, నాయకత్వం, లింగ వివక్ష మరియు మహిళా పారిశ్రామికవేత్తల అవసరం, సమగ్ర మరియు విభిన్న ఎస్.టి.ఐ. పర్యావరణ వ్యవస్థ కుటుంబం మరియు సంతానానికి సంబంధించిన అనేక విషయాలపై ఈ సందర్భంగా వివరంగా చర్చించారు.

ఎస్.టి.ఐ.పి.-2020 అధిపతి డాక్టర్ అఖిలేష్ గుప్తా, ఎథీనా స్వాన్  చార్టర్ యొక్క భారతీయ విధానం అమలు పరంగా ట్రాక్-II నిపుణుల సంప్రదింపుల సమయంలో సూచించిన కొన్ని ప్రధాన విషయాలతో పాటు, విద్యావేత్తలలో తప్పనిసరి స్థానాలు, మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం, పరిశోధన మరియు పరిపాలనలో సీనియర్ మహిళా శాస్త్రవేత్తలకు నాయకత్వ పాత్ర వంటి విషయాలను కూడా సమర్పించారు,

మహిళా సాధికారత కోసం జాతీయ ఉద్యమంగా కొనసాగుతున్న "శక్తి" అనే స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న స్వదేశీ భావనతో విజ్ఞానశాస్త్ర ఉద్యమ సంస్థ "విజ్ఞానభారతి" సమాచార సదస్సును నిర్వహించింది. 

డి.ఎస్.టి యొక్క “కిరణ్” (పోషణ ద్వారా పరిశోధన పురోగతిలో జ్ఞానం ప్రమేయం) పథకం, ముఖ్యంగా క్యూరీ (మహిళా విశ్వవిద్యాలయాలలో  ఆవిష్కరణలు, శ్రేష్టతలకోసం విశ్వవిద్యాలయ స్థాయిలో ఏకీకరణ) కార్యక్రమం, జీవ సాంకేతిక విజ్ఞాన విభాగానికి చెందిన "బయోకేర్" కార్యక్రమం వంటి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల గురించి డాక్టర్ గుప్త ప్రముఖంగా పేర్కొన్నారు  

ద్వంద్వ నియామక విధానం, పని సమయాల్లో సద్దుబాటు చేసుకునే అవకాశం, డే కేర్ సెంటర్లు, ‘సమానత్వం మరియు చేరిక కార్యాలయం’ ఏర్పాటు మొదలైనవాటితో పాటు మహిళల కెరీర్ విరామాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

గొప్ప మహిళా శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తలైన లీలావతి, గార్గి మరియు ఖానా యొక్క కొన్ని చారిత్రక ఉదాహరణలను తీసుకొని సైన్స్ మరియు విద్యలో మహిళల భాగస్వామ్యం గురించి డాక్టర్ గుప్తా నొక్కిచెప్పారు.  కొత్త ఎస్.టి.ఐ. పాలసీని దాని అవసరం మరియు ప్రత్యేక లక్షణాల పరంగా పరిచయం చేశారు.  ట్రాక్-1 పబ్లిక్ కన్సల్టేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, సూత్రీకరణ ప్రక్రియ యొక్క సమగ్ర దృక్పథాన్ని ఆయన వివరించారు. ఎస్.టి.ఐ.పి.-2020 లో మహిళల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు. 

మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థ కోసం మద్దతు నెట్ వర్కును నిర్మించడం గురించి నిపుణులు సూచించారు.  విధానాలు మరియు కార్యక్రమాల పరంగా స్పష్టమైన మరియు కఠినమైన అమలు వ్యూహం, సున్నితత్వం మరియు అవగాహన మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలైన వాటిపై కూడా వారు పలు సూచనలు చేశారు. 

 

STIP- women scientists.jpg

*****



(Release ID: 1657805) Visitor Counter : 390