రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ మొదటి పేజీలో "19 సెప్టెంబర్ 1949 రోడ్ ట్రాఫిక్ అంతర్జాతీయ సదస్సు" అనే స్టాంప్ ను ముద్రించమని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిల)కు సూచించిన ఎంఓఆర్టిహెచ్

Posted On: 21 SEP 2020 2:53PM by PIB Hyderabad

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడిపి) మొదటి పేజీలో "19 సెప్టెంబర్ 1949 రహదారి ట్రాఫిక్ అంతర్జాతీయ సదస్సు" అనే స్టాంప్ వేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. భారతీయ పౌరులకు జారీ చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతిని అనేక దేశాలు అంగీకరించడం లేదని, అక్కడి అధికారులు 1949 సెప్టెంబర్ 19 నాటి రోడ్ ట్రాఫిక్ అంతర్జాతీయ సదస్సు ప్రకారం ఐడిపి ధ్రువీకరణ కోసం అడుగుతున్నారని వివిధ ప్రజా ఫిర్యాదుల ద్వారా మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. రవాణా కార్యదర్శులు / రాష్ట్రాల కమిషనర్లు / యుటిలకు ఇచ్చిన అడ్వైజరీ లో, కొందరు ఆర్టిఓలు వేసిన స్టాంప్ కి సంబంధించిన కాపీ ని మంత్రిత్వ శాఖ సమకూర్చింది. అంతర్జాతీయ పరిశీలనకు అది ఆమోదం పొందింది. 
 

***



(Release ID: 1657528) Visitor Counter : 133