పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

పంచాయతీల బ‌లోపేతానికి 'ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్'

Posted On: 20 SEP 2020 4:08PM by PIB Hyderabad

గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పించే ఉద్దేశ్యంతో.. పంచాయతీలను డిజిటలైజేషన్ చేసి బలోపేతం చేసేందుకు మంత్రిత్వ శాఖ ఏకీకృత సాధనంగా 'ఈ-గ్రామ్ స్వరాజ్' అనే పోర్టల్‌ను (https://egramswaraj.gov.in/) అభివృద్ధి చేసింది. గ్రామ పంచాయతీలలో చేప‌ట్టిన పనుల సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు మూల్యాంకనకు ఈ పోర్ట‌ల్ దోహ‌దం చేయ‌నుంది.
'ఈ-గ్రామ్ స్వరాజ్' గ్రామ పంచాయతీల ప్రణాళిక, అకౌంటింగ్ మరియు పర్యవేక్షణ విధులను ఏకీకృతం చేస్తుంది. ఇది ఏరియా ప్రొఫైలర్ అప్లికేషన్, లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) మరియు పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో (పీఎఫ్‌ఎంఎస్) కలిపి గ్రామ పంచాయతీ కార్యకలాపాలను సులభంగా నివేదించడానికి, ట్రాక్ చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. పంచాయతీ యొక్క పూర్తి ప్రొఫైల్, పంచాయతీ ఆర్థిక వివరాలు, ఆస్తుల‌ వివరాలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ద్వారా చేప‌ట్టిన‌ కార్యకలాపాలు, ఇతర మంత్రిత్వ శాఖలు / శాఖల నుండి తీసుకున్న పంచాయతీ సమాచారం, జ‌నాభా లెక్క‌లు-2011, ఎస్ఈసీసీ డేటా, మిషన్ అంత్యోదయ సర్వే నివేదికల‌ను గురించి తెలుసుకొనేందుకు ఇది ఒక ఏకగ‌వాక్షంగా కూడా పని చేస్తుంది. 2020-21 సంవత్సరానికి సుమారు 2.43 లక్షల గ్రామ పంచాయతీలు ఈ-గ్రామ్ స్వరాజ్ పై తమ జీపీడీపీని ఖరారు చేశాయి. ఇంకా, సుమారు 1.24 లక్షల గ్రామ పంచాయతీలు ఈ-గ్రామ్ స్వరాజ్ ఆన్‌లైన్ చెల్లింపు మాడ్యూల్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపాయి.

***


(Release ID: 1657024) Visitor Counter : 289