ఆర్థిక మంత్రిత్వ శాఖ

పీఎంజేడీవై ఖాతాదారులకు బీమా సౌకర్యం

Posted On: 20 SEP 2020 2:10PM by PIB Hyderabad

'ప్రధాన్ మంత్రి జన-ధన్ యోజన'‌ (పీఎం‌జేడీవై) కింద పీఎం‌జేడీవై ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుల‌ను రూ.ల‌క్ష ప్ర‌మాద బీమా క‌వ‌రేజీతో అంత‌ర్నిర్మితంగా అందించడ‌మైంది. 28.08.2018 తర్వాత తెర‌వ‌బ‌డిన పీఎం‌జేడీవై ఖాతాదారుల‌కు ఈ కవరేజ్ మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల‌కు పెంచ‌డ‌మైంది. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విష‌య‌మై మరిన్ని వివరాలను తెలియజేస్తూ, అర్హతగల మరియు సుముఖంగా ఉన్న పీఎం‌జేడీవై ఖాతాదారులందరూ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ప‌థ‌కాల‌లోనూ నమోదు కావొచ్చున‌ని ఆయ‌న తెలిపారు. పీఎంఎస్‌బీవై కింద రూ.రెండు ల‌క్ష‌ల
ప్రమాద బీమా క‌ల్పిస్తారు. ఇందుకు ఖాతాదారులు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు క‌లిగి ఉండాలి. వార్షిక ప్రీమియం రూ.12 లుగా ఉంటుంది. ఖాతాదారుడు త‌మ సమ్మతి తెలియ‌జేస్తే బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ప్ర‌తి ఏడాది ఆటో డెబిట్ అవుతుంది. పీఎంజేజేబీవై కింద రూ.రెండు ల‌క్ష‌ల మేర జీవిత బీమాను క‌ల్పిస్తారు. ఇందుకు ఖాతాదారులు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు క‌లిగిన వారై ఉండాలి. దీనికి గాను వార్షిక ప్రీమియం రూ.330గా ఉంటుంది. ఖాతాదారుడు త‌మ సమ్మతి తెలియ‌జేస్తే  బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ప్ర‌తి ఏడాది ఆటో డెబిట్ అవుతుంది.
                                 

****



(Release ID: 1656984) Visitor Counter : 179