ఆర్థిక మంత్రిత్వ శాఖ
35,074 మంది పన్ను చెల్లింపుదారులు 'వివాద్ సే విశ్వాస్ పథకం'ను ఎంచుకున్నారు
Posted On:
20 SEP 2020 2:05PM by PIB Hyderabad
ప్రత్యక్ష పన్నుల చెల్లింపులకు సంబంధించి 'వివాద్ సే విశ్వస్' చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ వరకు మొత్తం 35,074 మంది పన్ను చెల్లింపుదారులు ఈ పథకాన్ని ఎంచుకున్నారు. వీరు ఫారం-1(పథకం కింద డిక్లరేషన్) ద్వారా తమ వివరాలను వెల్లడించారు. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి మంత్రి ఠాకూర్ మరిన్ని వివరాలను తెలియజేస్తూ. ఈ చట్టం ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ.9,538 కోట్ల మేర ఆదాయం సమకూరినట్టుగా వివరించారు. ఈ మొత్తంలో పథకం కింద తమ డిక్లరేషన్లను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు చేసిన చెల్లింపులు ప్రతిబింబించలేదని వివరించారు. ఈ పథకం కింద పన్ను చెల్లింపుదారులు తమ
డిక్లరేషన్లను దాఖలు చేసే కాలపరిమితిని.. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టుగా తెలిపారు.
****
(Release ID: 1656982)
Visitor Counter : 208