రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఎన్ఈపి సమతుల్యమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజాన్ని అభివృద్ధి చేసే దృష్టికోణాన్ని నిర్దేశిస్తుంది: రాష్ట్రపతి శ్రీ కోవింద్

ఎన్ఈపి సమ్మిళితాన్ని, శ్రేష్ఠతను సాధిస్తుంది

ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం-2020 అమలుపై సందర్శకుల సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి

Posted On: 19 SEP 2020 12:06PM by PIB Hyderabad

సమ్మిళితం, శ్రేష్ఠత అనే రెండు లక్ష్యాలను సాధించడం ద్వారా 21 వ శతాబ్దం అవసరాలను తీర్చడానికి విద్యా వ్యవస్థను తిరిగి మార్చడం జాతీయ విద్యా విధానం లక్ష్యం. అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా సమానమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజాన్ని అభివృద్ధి చేయాలనే దృష్టిని ఇది నిర్దేశిస్తుందని భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం 2020 అమలు' పై ఈ రోజు (సెప్టెంబర్ 19, 2020)  సందర్శకుల సదస్సులో  ప్రారంభోపన్యాసం చేశారు. .

ఈ విధానాన్ని తయారుచేసిన విద్యా మంత్రిత్వ శాఖ, డాక్టర్ కస్తూరిరంగన్, అతని బృందం చేసిన కృషిని ప్రశంసించిన రాష్ట్రపతి, 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 12,500 కి పైగా స్థానిక సంస్థలు, సుమారు 675 జిల్లాలతో విస్తృతంగా సంప్రదించిన తరువాత ఈ విధానం రూపొందించారని పేర్కొన్నారు. రెండు లక్షల సూచనలు క్షేత్ర స్థాయి అవగాహనను ప్రతిబింబిస్తాయని అన్నారు. 

ఉన్నత విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, రాష్ట్రపతి శ్రీ కోవింద్ ఈ సంస్థలకు భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్‌గా మార్చడంలో ఎక్కువ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సంస్థలు ప్రామాణికంగా నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాలను ఇతర సంస్థలు అనుసరిస్తాయి. తార్కిక నిర్ణయం తీసుకోవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి విధానం యొక్క ప్రాథమిక సూత్రాలలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు ఉన్నాయి అని రాష్ట్రపతి నొక్కిచెప్పారు. ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య స్వేచ్ఛగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, చర్చించుకోవడం అనే  భావనను పునరుద్ఘాటిస్తూ భగవద్గీత, కృష్ణ-అర్జున్ సంభాషణల నుండి ప్రేరణ పొందాల్సిందిగా సోదాహరణగా వివరించారు.  విమర్శనాత్మక ఆలోచన, శోధించే స్ఫూర్తిని ప్రోత్సహించడానికి కూడా ఎన్ఈపి ప్రయత్నిస్తుంది. ఎన్ఈపి 2020 ని  సమర్థవంతంగా అమలు చేయగలిగితే తక్షశిల, నలంద కాలంలో ఉన్నట్లుగా భారతదేశ వైభవాన్ని గొప్ప అభ్యాస కేంద్రంగా పునరుద్ధరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్‌ఇపి వినూత్న లక్షణాలను వివరిస్తూ రాష్ట్రపతి కోవింద్, అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ వ్యవస్థను కూడా ప్రవేశపెడతారని చెప్పారు. ఇది వివిధ ఉన్నత విద్యా సంస్థల నుండి సంపాదించిన అకడమిక్ క్రెడిట్లను డిజిటల్‌గా నిల్వ చేస్తుంది, తద్వారా విద్యార్థులు సంపాదించిన క్రెడిట్లను పరిగణనలోకి తీసుకుని డిగ్రీలను ప్రదానం చేయవచ్చు. తగిన నిష్క్రమణ మరియు రీ-ఎంట్రీ పాయింట్ల సౌలభ్యాన్ని ఇవ్వడంతో పాటు, వారి వృత్తి, వృత్తిపరమైన లేదా మేధోపరమైన అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు కోర్సులు తీసుకునే స్వేచ్ఛను ఇది అనుమతిస్తుంది. ఈ విధానంలో బి.ఎడ్., వృత్తి, దూరవిద్య కోర్సులను కఠినంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి లేదా జిఇఆర్‌ను 50 శాతానికి పెంచడమే ఎన్‌ఇపి 2020 లక్ష్యం అని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. ఆన్‌లైన్ విద్యావ్యవస్థను కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యం ముఖ్యంగా మహిళా విద్యార్థులకు, విద్యా సంస్థలకు మరియు అంతర్జాతీయ విద్యార్థులకు భౌతికంగా ప్రవేశం లేని వారికి వినియోగం అవుతుంది. 2018-19 సంవత్సరానికి ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం, ఆడవారికి జిఇఆర్ మగవారి కంటే కొంచెం ఎక్కువ. ఏదేమైనా, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలలో మహిళా విద్యార్థుల వాటా చాలా తక్కువ, ఉన్నత విద్యలో ఇటువంటి లింగ అసమానతలను సరిచేయాలని అన్నారు. ఇది ఉపాధ్యాయులు మరియు విద్యార్థులపై ప్రభావం చూపే సంస్థల అధిపతి పాత్ర అని, అందువల్ల సంస్థల అధిపతులు ఈ విధానాన్ని అమలు చేయడానికి  ఉత్సాహం ఆసక్తి చూపాలని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ సదస్సు ప్రారంభోపన్యాసం చేశారు. సదస్సుకు హాజరైన ప్రముఖులను స్వాగతిస్తూ, ఏ సమాజానికైనా విద్య పురోగతికి ఆధారం అని అన్నారు. పటిష్టమైన విద్యా విధానాన్ని అమలు చేయడం కేవలం రాజ్యాంగమే కాదు, నైతిక బాధ్యత, ఎన్ఈపి  2020 మన విద్యావ్యవస్థను వికేంద్రీకరించడానికి, బలోపేతం చేయగలదని శ్రీ పోఖ్రియాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

2020 సెప్టెంబర్ 7 న ఇదే అంశంపై రాష్ట్రపతి మార్గదర్శకత్వంలో గవర్నర్స్ కాన్ఫరెన్స్ జరిగిందని శ్రీ పోఖ్రియాల్ గుర్తు చేసుకున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడంలో వ్యూహరచన చేయాలనే లక్ష్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సూచించారని, మన దేశంలో విద్యా ప్రమాణాల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యమని ఆయన తెలిపారు. కొత్త విద్యావిధానం అమలులో ఉన్న అడ్డంకులన్నిటిని తొలగించుకుని, దీనిలో భాగస్వామ్యులైన వారందరితో సంప్రదింపులు జరిపే ప్రక్రియ ఏర్పాటవ్వాలని శ్రీ పోఖ్రియాల్ తెలిపారు. ఇందుకు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలన్నీ కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఎస్‌పిఎలు డైరెక్టర్లు మొదలైన వారు పాల్గొన్నారు. 

రాష్ట్రపతి ప్రసంగం కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి:

 

****


(Release ID: 1656772) Visitor Counter : 201