భారత పోటీ ప్రోత్సాహక సంఘం

బంబార్డియర్ ట్రాన్స్ పోర్టేషన్ కు చెందిన ఆస్తులపై అల్ స్టోమ్ ఎస్ ఏ పూర్తి అదుపు సాధించడానికి, అల్ స్టామ్ కార్పొరేషన్ లో 18 శాతం వాటాలు కాసీ డి డిపో ఎల్ ప్లేస్ మెంట్ డ్యూ క్యుబెక్ (సిడిపిక్యు), 3 శాతం వాటాలు బంబార్డియర్ ఇన్ కార్పొరేటెడ్ (బంబార్డియర్) కొనుగోలు చేయడానికి సిసిఐ అనుమతి

Posted On: 19 SEP 2020 10:34AM by PIB Hyderabad

కాంపిటీషన్ చట్టం, 2002 సెక్షన్ (2) కింద బంబార్డియర్ కార్పొరేషన్లపై అల్ స్టోమ్ ఎస్ఏ (అల్ స్టోమ్) పూర్తి అదుపు సాధించడానికి. అల్ స్టోమ్ ఎస్ఏలో 18 శాతం వాటాలు  కాసీ డి డిపో ఎల్ ప్లేస్ మెంట్ డ్యూ క్యుబెక్ (సిడిపిక్యు), 3 శాతం వాటాలు బంబార్డియర్ ఇన్ కార్పొరేటెడ్ (బంబార్డియర్) కొనుగోలు చేయడానికి సిసిఐ అనుమతి ఇచ్చింది.

ఫ్రాన్స్ కు చెందిన అల్ స్టోమ్ ప్రపంచ వ్యాప్తంగా  రైలు ట్రాన్స్ పోర్ట్ పరిశ్రమలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ. పలు రైలు రవాణా సొల్యూషన్లు అందిస్తుంది. భారతదేశంలో అల్ స్టోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అల్ స్టోమ్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్, అల్ స్టోమ్ ట్రాన్స్ పోర్ట్ ఇండియా లిమిటెడ్, మధేపురా ఎలక్ర్టిక్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ సహా తన అనుబంధ సంస్థల ద్వారా ఆ సంస్థ సిగ్నలింగ్ సొల్యూషన్లు, రైల్ విద్యుదీకరణ, రోలింగ్ స్టాక్ ల (లోకోమోటివ్ లు, మెట్రోలు) సరఫరా,  ట్రాక్ పనులు , మెయింటెనెన్స్ పనులు, నిర్మాణం, ఇంజనీరింగ్ పనులు చేపడుతోంది.
 
కెనడాకు చెందిన బంబార్డియర్ కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా విమానాలు, రైలు ట్రాన్స్ పోర్ట్ పరిశ్రమలు నడుపుతోంది.

బంబార్డియర్ కు చెందిన అంతర్జాతీయ రైలు సొల్యూషన్ల విభాగం బంబార్డియర్ ట్రాన్స్ పోర్టేషన్.  విస్తృతంగా రైలు సొల్యూషన్లు అందిస్తోంది. బంబార్డియర్ ట్రాన్స్ పోర్టేషన్ సంస్థ అనుబంధ విభాగం బంబార్డియర్ ట్రాన్స్ పోర్టేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారాభారత్ లో రైల్ వాహనాలు, ప్రొపల్షన్, కంట్రోల్ పరికరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ సరఫరా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 

సిపిడిక్యు అంతర్జాతీయంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే సంస్థ, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల పెన్షన్, బీమా ప్లాన్లకు చెందిన నిధులను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సంస్థ ఆర్థిక మార్కెట్లు, ప్రైవేట్ ఈక్విటీ, ఫిక్స్ డ్ ఇన్ కమ్, మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతుంది. 
ఈ అనుమతులకు సంబంధించిన సవివరమైన సిసిఐ ఉత్తర్వు త్వరలో రానుంది.

***
 



(Release ID: 1656767) Visitor Counter : 131