ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జి 20 ఆర్థిక, ఆరొగ్య మంత్రుల సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెరుగైన సంసిద్ధతకు సమర్థవంతమైన ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి ”: డాక్టర్ హర్ష్ వర్ధన్
Posted On:
17 SEP 2020 7:05PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జి-20 ఆర్ధిక, ఆరోగ్య మంత్రుల సంయుక్త సమావేశానికి వీడియో కాన్ఫరె్సు ద్వారా ఈరొజు హాజరయ్యారు. సౌదీ అరేబియా జి20 అధ్యక్ష హోదాలో ఈ సెషన్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
ప్రజారొగ్యంపై పెట్టే ఖర్చు వల్ల ప్రయోజనాన్ని డాక్టర్ హర్షవర్దన్ ప్రస్తుతించారు. ఇండియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు.
కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సంక్షిప్త ప్రసంగ పాఠం తెలుగు అనువాదం కిందివిధంగా ఉంది.
అధ్యక్ష, గౌరవ మంత్రులారా,
ప్రస్తు మహమ్మారి, దీనిద్వారా నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం జాతీయంగా, అంతర్జాతీయంగా మున్నెన్నడూ లేనంతగా సంఘటితంగా ఉండవలసిన అవసరాన్ని సూచిస్తున్నది.
వైరస్ కేసులు సంఖ్య అంతర్జాతీయంగా తగ్గాలంటే, అంతర్జాతీయంగా, వివిధ రంగాలలో సహకారం అవసరం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ సంక్లిష్టమైన కొవిడ్ కేసులను ఎదుర్కొనే విధంగా తగిన సమర్ధతను పెంచుకోవాలి. ఆ రకంగా పేదలు, వయోధికుల ప్రాణాలు కాపాడుకొవాలి.
వైరస్‌ల మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెరుగైన సన్నద్ధత , సమర్ద ఆరొగ్య వ్యవస్థలపై దృష్టిపెట్టాలి. ఇతర కార్యాచరణ ప్రణాళికలు, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టేచర్యలు అయితే , అభివృద్ధి చెందిన సమగ్ర ఆరోగ్య వ్యవస్థ వైరస్ మహమ్మారిని అడ్డుకట్టవేసేందుకు ఎంతగానో దోహదపడగలదు.కోవిడ్ 19 పరీక్షలు, చికిత్స,వాక్సిన్ అనేవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి కాని , డబ్బు చెల్లించగల స్థోమతను బట్టి వీటి అందుబాటు ఉండరాదు.
నాణ్యమైన, పొదుపుతో కూడిన తయారీ రంగ చరిత్ర కలిగిన భారతదేశం, తన మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్
కృషికి, పరిశొధన అభివృద్ధి, పంపిణీ వ్యవస్థనిర్వహణకు డిజిటల్ సామర్ధ్యాలకు మద్దతు ఇవ్వనుంది.
మనమందరం ప్రస్తుత కార్యక్రమాలైన యాక్సెస్ టు కోవిడ్ 19 టూల్స్ యాక్సిలరేటర్ (ఎసిటి-ఎ) ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి.అలాగే అంతర్జాతీయంగా పరీక్షలు, చికిత్స, వాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ఆరోగ్యవ్యవస్థలను బలోపేతం చేసుకొవాలి.
గతంలో 2003లొ వచ్చిన సార్స్, 2014-15 సంవత్సరంలో వచ్చిన ఎబొలా, వంటి వాటి అనుభవాలను దృష్టిలొ ఉంచుకుని మరింత మందికి వ్యాధిసోకకుండా, మరణాలను తగ్గించేందుకు అంతర్జాతీయంగా సంఘటితంగా వ్యవహరించడం తప్పనిసరి. అలాగే నాయకత్వాల ఉదాహరణలను, సమకారాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. బాహాట సమాచారం, పారదర్శకత వంటివి అంతర్జాతీయంగా వ్యాధిని తగ్గించే కృషికి దోహదపడతాయి.
భారతదేశం సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజ్‌కి కట్టుబడి ఉంది. ప్రస్తుత సంక్లిస్టసమయంలో,ఇండియా ప్రపంచ దేశౄల ఉమ్మడి లక్ష్యమైన ప్రజల ప్రాణాలు కాపాడడం, ఆరోగ్య సంరక్షణ, అంతర్జాతీయంగా ఆర్ధిక వ్యవస్థను వీలైనంత త్వరగా గాడినపెట్టడానికి
కట్టుబడి ఉంది.
ప్రజారోగ్యంలో నాయకత్వానికి అలాగే భవిష్యత్ పై బలమైన ప్రభావం చూపడానికి కోవిడ్ అనంతర కాలానికి సిద్ధం కావడానికి ఇది నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన సమయం ..
ప్రజారోగ్య నాయకులు సరిహద్దులను మించి ముందుకు చూడవలసి ఉంది. వైరస్‌పై పోరాటంలో మనం అంతర్జాతీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి.దీనికి సరిహద్దులతో సంబంధం లేదు. ప్రస్తుత, భవిష్యత్ పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవలసి ఉంది.
***
(Release ID: 1656305)
Visitor Counter : 186