విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బర్‌హరాలో 6.99 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
ఈ ప్రాజెక్టులు భోజ్‌పూర్ జిల్లా బర్‌హరా బ్లాక్‌లోని గ్రామాలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సదుపాయాలను మెరుగుపరుస్తాయి.
Posted On:
18 SEP 2020 2:13PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ , నూతన పునరుత్పాదక ఇంధనశాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్, ఆర్.ఇ.సి లిమిటెడ్ (పూర్వపు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్) 6.99 కోట్ల రూపాయలతో చేపట్టిన సిఎస్ ఆర్ ప్రాజెక్టులను భోజ్‌పూర్ జిల్లా బర్‌హరాలో నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఇందులో మొత్తం 77 పథకాలు ఉన్నాయి. వీటిలో 36 పథకాలు పిసిసి రోడ్లు, 23 పథకాలు ఎల్.ఇ.డి, సోలార్, హైమాస్ట్ లైట్లు , 3 ఘాట్ల నిర్మాణం, 3 కమ్యూనిటీ హాళ్లు సబ్ హెల్త్ సెంటర్లు, 12 ఆర్సెనిక్ తొలగింపు ప్లాంట్లు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం, భోజ్‌పుర్ జిల్లా బర్‌హరా బ్లాక్‌లోని గ్రామాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, అభివృద్ది సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించినది.శ్రీ ఎస్.కె.గుప్త సిఎండి, శ్రీ అజయ్ చౌదురి, డైరక్టర్ ఫైనాన్స్, శ్రీ ఆర్ .లక్ష్మణన్ ఐఎఎస్, ఆర్.ఇ.సి ఇడిలు ఈ సందర్బంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో శ్రీ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, మాజీ ఎమ్మెల్యే, బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి పాల్గొని బహరాలో ఈ కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగించారు.
ఆర్.ఇ.సి లిమిటెడ్ గురించి: ఆర్.ఇ.సి లిమిటెడ్ ) పూర్వం గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ లిమిటెడ్) నవరత్న ఎన్.బి.ఎఫ్.సి కంపెనీ. ఇది దేశవ్యాప్తంగా విద్యుత్ రంగం ఫైనాన్సింగ్, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. 1969లో ఏర్పాటైన ఆర్.ఇ.సి లిమిటెడ్,తన కార్యకలాపాల నిర్వహణలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది విద్యుత్ రంగ వాల్యూ చెయిన్‌లొ ఆర్థిక సహాయాన్నిఅందిస్తుంది. దీనితొపాటు, ఆర్.ఇ.సి విద్యుత్ రంగంలో భారత ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డిడియుజిజెవై) సౌభాగ్య తదితర పథకాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
***
(Release ID: 1656206)
Visitor Counter : 162