వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పీఎం-కిసాన్ పథకం అమలు
నాడు పోస్టు చేయడమైనది:
18 SEP 2020 3:15PM by PIB Hyderabad
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద ప్రయోజనం పొందే అర్హులైన భూమి ఉన్న రైతు కుటుంబాలను గుర్తించడం, వారి అర్హతల సమాచారాన్ని పీఎం-కిసాన్ పోర్టల్‌లో పొందుపరచడం రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల బాధ్యత. 17-09-2020 నాటికి ఈ పోర్టల్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల మొత్తం సంఖ్య 11,07,62,287. పీఎం-కిసాన్ పోర్టల్‌లో 2019 నుంచి పొందుపరిచిన లబ్ధిదారుల వివరాలు అనుబంధం-1లో రాష్ట్రాలవారీగా ఉన్నాయి.
ఈ పథకం అమలుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు 'ఫిర్యాదుల పరిష్కార సంఘాలను' రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వారు అందుకున్న లేదా పరిష్కరించిన ఫిర్యాదుల సమాచారాన్ని కేంద్రం నిర్వహించదు.
కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని రాజ్యసభకు సమర్పించారు.
(As on 17-09-2020)
*****
(రిలీజ్ ఐడి: 1656202)
సందర్శకుల సూచీ సంఖ్య : : 232