యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే అత్యంత పెద్ద యువజన సంస్థ ఎన్.వై.కె.ఎస్: శ్రీ కిరణ్ రిజిజు
प्रविष्टि तिथि:
17 SEP 2020 4:24PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ వివిధ యువజన కేంద్రిత కార్యకలాపాలను యువజనుల అభివృద్ధి కోసం తన మూడు ప్రధాన పథకాల ద్వారా అమలు చేస్తోంది. అవి 1)రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రం 2) జాతీయ సేవా కార్యక్రమం (ఎన్.ఎస్.ఎస్) 3) రాజీవ్ గాంధీ యువజన అభివృద్ధి జాతీయ సంస్థ (ఆర్.జి.ఎన్.ఐ.వై.డి)
యువజన వ్యవహరాల విభాగం పథకాల వివరాలకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
కేంద్ర యువజన వ్యవహారాలు ,క్రీడల మంత్రిత్వశాఖ కింద మూడు సంస్థలు యువజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.అవి (1) నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్ వైకె ఎస్), 2) నేషనల్ సర్వీస్ స్కీమ్ ( ఎన్.ఎస్.ఎస్), 3)ఆర్.జి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ యూత్ డవలప్‌మెంట్ (ఆర్‌జి ఎన్ ఐ వై డి ) .
ఈ సంస్థలు కింది విధంగా ఉన్నాయి.
1. ఆర్.జి.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డవలప్‌మెంట్ (ఆర్‌జిఎన్ఐవైడి): తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులోగల ఆర్.జి.ఎన్.ఐ.వై.డి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ కింద జాతీయ ప్రాధాన్యత గల సంస్థ. ఆర్.జి.ఎన్.ఐ.వై.డి కీలక రిసోర్సు సెంటర్‌గా పనిచేస్తుంది.ఇది యువజనుల అభివృద్ధికి సంబంధించిన వివిధ కోణాల విషయంలో పిజిస్థాయిలో కార్యక్రమాలను ఆఫర్ చేస్తూ బహుముఖీనమైన కృషి చేస్తోంది. యువజన అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై పరిశోధనలు చేస్తోంది. అలాగే యువజన అభివృద్ధిలో శిక్షణ, సామర్ద్యాల పెంపు నకు కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరణ చర్యలు, ఔట్‌రీచ్‌కార్యక్రమాలు చేపడుతోంది.
2. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వెకెఎస్): నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంస్థ. ఎన్.వై.కె.ఎస్ దేశవ్యాప్తంగా 623 జిల్లాలలో నెహ్రూ యువ కేంద్రాల ద్వారా పనిచేస్తోంది. ఈ సంస్థ లక్ష్యం యువజనుల వ్యక్తిత్వవికాసం,వారిని జాతి నిర్మాణ కార్యకలాపాలలో భాగస్వాములను చేయడం. ఎ.వై.కె.ఎస్ కార్యకలాపాలలో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, పర్యావరణం, సామాజిక కార్యకలాపాలపై అవగాహన, మహిళా సాధికారత, పౌర విద్య, విపత్తు సహాయం, పునరావాసం వంటి అంశాలు ఉన్నాయి.
3) జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) : నేషనల్ సర్వీస్‌స్కీమ్ (ఎన్.ఎస్.ఎస్)ను 1969లో ప్రవేశపెట్టారు. విద్యార్ధులలో స్వచ్ఛంద కమ్యూనిటీ సేవా కార్యకలాపాల ద్వారా వ్యక్తిత్వవికాసం, నైతిక విలువలు పెంపొందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. సేవ ద్వారా విద్య అనేది ఎన్.ఎస్.ఎస్ ఉద్దేశం. మహాత్మాగాంధీ ఆదర్శాలతో ప్రేరణ పొందినదే ఎన్.ఎస్.ఎస్ సైద్ధాంతిక భూమిక. నేను కాదు, ముందు మీరు . అనేది ఎన్.ఎస్.ఎస్ మోటో.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.87 లక్షల యువజన క్లబ్బులు నెహ్రూ యువ కేంద్రా సంఘటన్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీటిలోని సభ్యుల సంఖ్య36 లక్షల యువ వాలంటీరు. అలాగే ఎన్.ఎస్.ఎస్ కు దేశవ్యాప్తంగా 479 విశ్వవిద్యాలయాలు, 17676 కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు, 12087 సీనియర్ సెకండరీ పాఠశాలల నుంచి 36 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర యువజన వ్యవహారాఉ, క్రీడల శాఖ సహాయ మంత్రి ( ఇంఛార్జి) శ్రీకిరణ్ రిజిజు ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1656012)
आगंतुक पटल : 230