గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి సమయంలో గిరిజన కమ్యూనిటీలకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు.
Posted On:
17 SEP 2020 4:11PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని పునరుద్దరించేందుకు అవసరమైన చ ర్యలు , ఆ చర్యల అమలుకు ఒక మార్గసూచిని తయారు చేసేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక అధికారుల బృందాన్ని నియమించింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ విజ్ఞప్తి మేరకు , కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆర్డర్ నెం 40-3/2020-DM-I(A) తేదీ 16/04/20న మార్గదర్శకాలు జారీచేస్తూ, చిన్న అటవీ ఉత్పత్తులు (ఎం.ఎఫ్.పి) కలపేతర అటవీ ఉత్పత్తులను (ఎన్‌టిఎఫ్‌పి) షెడ్యూల్డు తెగలు, దేశవ్యాప్తంగా గల అటవీ ప్రాంత నివాసులు సేకరించేందుకు, పంటకోతకు, ప్రాసెసింగ్‌కు కోవిడ్ నిబంధనలనుంచి మినహాయింపు ఇచ్చింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను సవరించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు ఎంతో అవసరమైన ఈ చర్యను తీసుకుంది.ఎం.ఎఫ్.పి ప్రోక్యూర్ మెంట్ కార్యకలాపాల ద్వారా గిరిజనుల ఆదాయవృద్ధికి వీలు కల్పించేందుకు ఎం.ఎఫ్.పిలకు సవరించిన ఎం.ఎస్.పికి సంబంధించి 2020 మే 1న మార్గదర్శకాలు జారీచేశారు. ఈ మార్గదర్శకాలు ఎం.ఎఫ్.పిలకు ఎం.ఎస్.పి ధరలను పెంచాయి. వీటి ప్రకారం అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు ఎక్కువ రాబడి లభించేట్టు చేశారు. దీనికితోడు 2020 మే 26న గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎం.ఎఫ్.పిలకు చెందిన 23 ఉత్పత్తులను ఎం.ఎస్.పి కిందికి తెచ్చింది. దీనితో ఈ పథకం కింద ఉన్న మొత్తం ఎం.ఎఫ్.పి ల సంఖ్య 73కు చేరింది. ఈ ఐటమ్‌లలో గిరిజనులు సేకరించే వ్యవసాయ, పండ్లతోటల ఉత్పత్తులు ఉన్నాయి.
గిరిజన వ్యవహారాల మంత్రత్వశాఖకు చెందిన కోవిడ్ ప్రతిస్పందన బృందం షెడ్యూల్డు తెగలవారిజీవనోపాధి, ఆరోగ్యానికి సంబంధించి కోవిడ్-19 మహమ్మారి ప్రతిస్పందన ప్రణాళికను రూపొందించింది.దీనిని గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆమోదించారు. ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకు దీనిని వివిధ స్టేక్‌హోల్డర్లకు అందించారు. రాష్ట్రాల టిఎస్‌పి లనుంచి నిధులను వినియోగించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. అలాగే ఈ మంత్రిత్వశాఖకు చెందిన వివిధ పథకాల కింద ఈ విధానంలో సమగ్ర ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా కూడా సూచించారు. కోవిడ్ ప్రతిస్పందన ప్రణాళిక కింద చేర్చిన వాటిలో కింది చర్యలు ఉన్నాయి.
అవి,
1.ఎస్‌టి ఏరియాలలో కమ్యూనిటీ వంటశాలల ఏర్పాటు (పివిటిజిలు ఎక్కువగా గల గ్రామపంచాయతీలు)
2.రేషన్ సరఫరా
3.డిబిటి ద్వారా మౌలిక ఆర్థిక సహాయం
4. మిషన్ మోడ్‌లో ఇప్పటికే మంజూరైన విడివికెల అమలు (21 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో 1126 విడివికెలు)
5. ఎం.ఎఫ్.పిలు నాన్ ఎం.ఎఫ్.పిల కు సంబంధించి ఎస్.హెచ్.జిల వద్ద ఉన్న స్టాక్ లెక్కింపు, ఈ ఉత్పత్తులకు ట్రైఫెడ్‌ద్వారా మార్కెట్ కల్పించేందుకు క ఋషి
6.గిరిజన ఉత్పత్తిదారులు , గిరిజనరైతులు, ఎం.ఎప్.పి సేకరణదారులకు గిట్టుబాటుధర ధరల కింద గిరిజన ఉత్పత్తుల ప్రొక్యూర్‌మెంట్, అమ్మకం, సరఫరా చెయిన్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం అభివృద్ధి.
7 గ్రామస్థాయిలో నీటి లభ్యతను మెరుగు పరచడం
8. సత్వరం కాపుకువచ్చే, ఆలస్యంగా కాపుకు వచ్చే కూరగాయలసాగు
9. చిన్న మేకల మేత యూనిట్లు,మినీ లేయర్ యూనిట్, మత్స్యకారులకు చేపలు పట్టే కిట్లు, పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం తదితరాలు ఉన్నాయి.
10. స్వయం ఉపాధి శిక్షణ, బ్యాంకు లింకేజి
11. యువకులకు నైపుణ్య శిక్షణ
12. ఇఎంఆర్ఎస్ నిర్మాణ పనుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల కల్పన
13. షెడ్యూల్డు తెగల ప్రాంతాలలో ఐసొలేషన్, క్వారంటైన్ సదుపాయాల ఏర్పాటుకు మద్దతు (గ్యాప్ ఫిల్లింగ్)
గిరిజన మంత్రిత్వశాఖ , గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ తో కలసి గ్రామ పంచాయతి ,గ్రామం వరకు ఆయా రంగాలలో ఉన్నగ్యాప్‌లను గుర్తించే కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రాలకు అందజేసి, గ్రామస్థాయిలో ఆరోగ్యరంగంతోసహా వివిధ రంగాలలో గ్యాప్‌లను తొలగించేందుకు వ్యూహాలు రూపొందించాల్సిందిగా అన్నిరాష్ట్రాలను కోరడం జరిగింది. గిరిజన మంత్రిత్వశాఖ గిరిజన ఆరోగ్యకార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించింది. దీనిని నీతి ఆయోగ్‌కు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం మంత్రిత్వశాఖకు, ఆయుష్ మంత్రిత్వశాఖకు, రాష్ట్రాలకు 2019 నవంబర్ లో అందజేయడం జరిగింది.ఈ ప్రణాళికపై నీతి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో పలు విడతలు చర్చలు జరిగాయి. కేంద్ర ఆరోగ్యకార్యదర్శి, ట్రైబల్‌వ్యవహారాల కార్యదర్శితొ .రాష్ట్ర ట్రైబల్‌సెక్రటరీలు, ఆరోగ్య సెక్రటరీల సంయుక్త విసి ఏర్పాటుకు పిలుపునివ్వడం జరిగింది.
దేశంలోని 177 గిరిజన జిల్లాలలో ఆరోగ్యమౌలిక సదుపాయాలు, మానవ వనరులకు సంబంధించిన లోపాలపై తాజా సమాచారం అందుబాటులో ఉంచేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ స్వాస్త్య పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. (swasthya.tribal.gov.in). ఇందులో కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమం, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకునుంచి సమాచారాన్ని సేకరించడం జరరుగుత
ఈ సమాచారాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుత ఒక లిఖిత పూర్వక సమాధానంలో రాజ్యసభకు తెలిపారు.
***
(Release ID: 1655895)
Visitor Counter : 249