యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

జాతీయ క్రీడా పురస్కారాల నగదు బహుమతిని ఇటీవల పెంచిన కేంద్ర ప్రభుత్వం: శ్రీ కిరెన్‌ రిజిజు

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2020 4:33PM by PIB Hyderabad

ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్‌ క్రీడలు వంటి పోటీల్లో పతక విజేతలు, క్రీడల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాక, నెలనెలా జీవితాంతం పింఛను పొందేలా "పెన్షన్‌ టు మెరిటోరియస్‌ స్పోర్ట్స్‌ పర్సన్స్‌" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇబ్బందికర పరిస్థితుల్లో జీవిస్తున్న మాజీ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించేందుకు "పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ పర్సన్స్‌" పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 

    జాతీయ క్రీడా పురస్కారాలకు ఇచ్చే నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది. రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న నగదు బహుమతిని రూ.7.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు, ద్రోణాచార్య పురస్కారం (రెగ్యులర్‌ విభాగం) రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, ద్రోణాచార్య పురస్కారం (జీవితకాల విభాగం) రూ.5 లక్షల నుంచి 15 లక్షలకు, అర్జున పురస్కారం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు, ధ్యాన్‌చంద్‌ పురస్కార నగదు బహుమతిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. "స్పెషల్‌ అవార్డ్స్‌ టు మెడల్‌ విన్నర్స్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ అండ్‌ దెయిర్‌ కోచెస్‌ స్కీమ్‌" కింద, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులు, శిక్షకులకు నగదు బహుమతులను కేంద్రం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా భర్తీ చేసే గ్రూప్‌-సి ఉద్యోగ ఖాళీల్లో క్రీడాకారులకు 5 శాతం వరకు కోటా కల్పించింది. దీని ప్రకారం, క్రీడల జాబితాలో 43గా ఉన్న క్రీడాంశాలను 63కు పెంచింది. "నేషనల్‌ స్పోర్ట్స్‌ డెవలెప్‌మెంట్‌ ఫండ్‌" కింద, క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాల కోసం ప్రత్యేక సాయాన్ని అందజేస్తోంది. 

 
    కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కిరెన్‌ రిజిజు ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.

 

***** 


(రిలీజ్ ఐడి: 1655894) సందర్శకుల సూచీ సంఖ్య : : 144
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Assamese , Bengali , Manipuri , Punjabi , Tamil