సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

గ్రామీణ భారతంలో సూక్ష్మ పారిశ్రామీకరణ ప్రక్రియను పునరుద్ధరించిన ఎం.ఎస్.ఎం.ఈ మంత్రిత్వశాఖ

మూలాలనుంచి ఆర్థికవ్యవస్థ పునరుత్తేజానికి

లబ్ధిదారు ఆధారిత స్వయం ఉపాధి పథకాలు

అగర్ బత్తీల తరువాత కుండల తయారీ, తేనెటీగల పెంపకం:

2020-2021లో రూ.130 కోట్లతో 8000కు పైగా లబ్ధిదారులు


లబ్ధిదారు సాయంతోబాటు క్లస్టర్ల మంజూరు:

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ప్రతిపాదన


ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా పథకాల విస్తరింపు

Posted On: 17 SEP 2020 1:05PM by PIB Hyderabad

కొద్ది రోజుల కిందట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ అగర్ బత్తీల తయారీలో ఆసక్తి ఉన్న చేతివృత్తులవారికి సహాయాన్ని విస్తరించి రెట్టింపు సాయం అందించబోతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళుతూ మంత్రిత్వశాఖ ఇప్పుడు సరికొత్త మార్గదర్శకాలతో కుండల తయారీ, తేనెటీగల పెంపకం అనే రెండు పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

మంత్రిత్వశాఖ తీసుకున్న ఈ చొరవ వల్ల లబ్ధిదారు ఆధారంగా స్వయం ఉపాధి పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి మూలాలనుంచి ఆర్థికవ్యవస్థను పునరుత్తేజింపజేయటంతోబాటు  ఆత్మనిర్భర్ భారత్ కు దోహదపడతాయి.

కుండల తయారీకి ప్రభుత్వసాయం

కుండల తయారీదారులకు ప్రభుత్వ సాయం కింద కుమ్మరి చక్రాన్ని, మట్టిపిసికే యంత్రాన్ని అందిస్తుంది. కుమ్మరి చక్రంతో కుండల తయారీకి తగిన శిక్షణ కూడా ఇప్పిస్తుంది. ఈ హస్త కళలో సంప్రదాయ కుమ్మరులతోబాటు ఆసక్తి ఉన్నవారందరూ  అధునాతన శిక్షణ పొందే వీలుంటుంది. కులవృత్తిదారులు కానిపక్షంలో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి  కూడా జిగ్గర్ జాలీ నడపటంలో శిక్షణ పొందవచ్చు.

దీనివలన :

• ఉత్పత్తిని పెంచటానికి కుమ్మరుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతూ సరికొత్త ఉత్పత్తులను తక్కువ ధరకే తయారుచేసేట్టు చూడటం

• కుండల తయారీ కళాకారుల ఆదాయాన్ని పెంచటానికి తగిన శిక్షణ, ఆధునిక యంత్రపరికాలు అందించటం

• కుమ్మరుల స్వయం సహాయక బృందాలకు అలంకార ఉత్పత్తుల తయారీ, కొత్త డిజైన్లమీద నైపుణ్యాభివృద్ధి శిక్షణ

• విజయవంతమైన సంప్రదాయ కుండల తయారీ వృత్తి కళాకారులకు ప్రధానమంత్రి ఉపాధి సృష్టి పథకం కింద ప్రోత్సహించటం

• ఎగుమతిదారులు, టోకు కొనుగాలుదారులతో అనుసంధానం చేయటం ద్వారా మార్కెటింగ్ మెరుగుపరచటం

• సరికొత్త ఉత్పత్తులు, ముడి సరకు కనిపెట్టి కుండల తయారీలో దేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళటం 

• కుండల తయారీనుంచి పింగాణీ పాత్రల తయారీకి ఎదిగేట్టు చూడటం 

• తయారీదారులకు శిక్షణ ఇవ్వదలచుకున్న నిపుణులైన కుండల తయారీ కళాకారులకు శిక్షణ

కుండల తయారీ పథకంలో మెరుగుదల:

i)  పూలతోటల కుండీలు, వంటపాత్రలు, నీళ్ళసీసాలు, అలంకరణ వస్తువులు, కుడ్యచిత్రాలవంటివి తయారుచేయటం మీద కుమ్మరుల స్వయం సహాయక బృందాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రవేశపెట్టారు

ii) ఉత్పత్తి పెంపు, కుమ్మరుల సాంకేతిక పరిజ్ఞానం పెంపు. ఉత్పత్తి వ్యయం తగ్గేలా కుమ్మరి కొలిమి సామర్థ్యం పెంపు 

iii) ఎగుమతిదారులు, టోకు కొనుగాలుదారులతో అనుసంధానం ఉత్పత్తిదారుల అనుసంధానానికి కృషి చేయటం

ఈ పథకం వల్ల మొత్తం 6075  మంది సంప్రదాయ, సంప్రదాయేతర  కుండల తయారీ హస్త కళాకారులు, గ్రామీణ నిరుద్యోగులు, వలస కార్మికులు లబ్ధిపొందుతారు

2020-21 సంవత్సరానికి ఆర్థిఅ సహాయంగా రూ. 19.50 కోట్లు వెచ్చించి  6075  మందికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అండగా నిలుస్తారు.  ఎంజిఐఆర్ఐ ( వార్ధా), సిజిసిఆర్ఐ (ఖుర్జా), విఎన్ఐటి (నాగపూర్) తోబాటు అనుకూలమైన ఐఐటి/ఎన్ ఐ డి/నిఫ్ట్ ద్వారా ఉత్పత్తి నమూనా తయారీ, మెరుగైన నైపుణ్యం, ఉత్పత్తుల నాణ్యతా ప్రామాణీకరణ సాధిస్తారు.

టెర్రకోట, ఎర్రమట్టి కుండల తయారీ  క్లస్టర్ల ఏర్పాటుకు అదనంగా రూ.  50.00 కోట్లు కేటాయించారు. దీనివలన నవకల్పనలతో  కుండల నుంచి పింగాణీ పాత్రలకు, పెంకుల తయారీకి మంత్రిత్వశాఖలోని స్ఫూర్తి పథకం కింద సామర్థ్యం పెంచుతారు.

తేనెటీగల పెంపకం పథకం విషయానికొస్తే, ప్రభుత్వ సాయం కింద తేనెటీగల పెట్టెలు, టూల్ కిట్స్ ఇస్తారు. ఈ పథకం కింద  ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ జిల్లాల్లో వలసకార్మికులకు  తేనెటీగల పెట్టెలతోబాటు తేనెటీగల సమూహాలు కూడా అందజేస్తారు. లబ్ధి దారులకు తేనెటీగల పెంపకం మీద శిక్షణాకేంద్రాలు/రాష్ట్ర తేనెటీగల విస్తరణాకేంద్రాలు. మాస్టర్ ట్రెయినర్స్ ద్వారా ఈ పాఠ్యాంశాలకు అనుగుణంగా ఐదు రోజుల శిక్షణ ఇస్తారు.

దీనివలన:

• తేనెటీగల పెంపకందారులు /రైతులకు సుస్థిర ఉపాధి కలుగుతుంది. 

• తేనెటీగల పెంపకందారులు /రైతులకు అదనపు ఆదాయ వనరు ఏర్పడుతుంది

• తేనె, తేనెతుట్టెల పట్ల అవగాహన పెంచవచ్చు

• హస్త కళాకారులు శాస్త్రీయ పద్ధతులలో తేనెటీగల పెంపక, నిర్వహణావిధానాలు అనుసరించేట్టు చూడవచ్చు

• తేనెటీగల పెంపకంలో అందుబాటులో ఉన్న వనరుల వినియోగం

• పరపరాగ సంపర్కంతో తేనెటీగల పెంపకం వల్ల కలిగే ప్రయోజనం పట్ల అవగాహన

ఈ ఉపాధి అవకాశాల ద్వారా అదనపు ఆదాయ వనరులు సమకూర్చటంతోబాటు ఈ ఉత్పత్తులలో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేయటం, అంతిమంగా ఎగుమతి మార్కెట్ ను అందుకోవటం దీని లక్ష్యమని మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేశారు.

తేనెటీగల పెంపకం పథకంలో మెరుగుదల

-  ఆదాయం పెంచటం, తేనె ఉత్పత్తులకు విలువపెంచే కార్యకలాపాలు ప్రతిపాదించటం

-  తేనెటీగల పెంపకం నిర్వహణ విధానాలలో శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం

-  తేనె ఆధారం ఉత్పత్తుల ఎగుమతుల పెంపుకు సహాయపడటం

 ముందుగా ఈ పథకం కింద 2020-21 లో మొత్తం 2050 మంది తేనెటీగల పెంపకం దారులు, రైతులు, నిరుద్యోగ యువత, ఆదివాసీలు లబ్ధి పొందుతారు. తేనె ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల పెంపుకు సహాయపడటం మరో లక్ష్యం.  ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. మొత్తం 2050 మంది లబ్ధిదారులకు సహాయం చేయాలని భావిస్తుండగా వారిలో 1250 మంది స్వయం సహాయక బృందాల వారు, ఎనిమిది వందల మంది వలస కార్మికులు ఉంటారు. సిఎస్ఐఆర్/ఐఐటి లేదా మరేదైనా ఉన్నత స్థాయి సంస్థ  కొత్త ఉత్పత్తులను, విలువ పెంపును సూచిస్తుంది. 

అదనంగా 50 కోట్ల రూపాయలను తేనెటీగల పెంపకం కోసం ఈ మంత్రిత్వ శాఖ కేటాయించింది. స్ఫూర్తి పథకం కింద క్లస్టర్లు నెలకొల్పటానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు.

ఈ పథకాల కోసం ఇంగ్లీష్ లోనూ,  హిందీలోనూ సవివరమైన మార్గదర్శకాలను రూపొందించి మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్లో ఉంచింది.  వీటిని సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు

కొద్దిరోజుల కిందటే అగర్ బత్తీ తయారీకి సంబంధించి మూల స్థాయిలో పునరుత్తేజానికి చొరవ తీసుకోవటం తెలిసిందే. ఇది మేకిన్ ఇండియా దిశలో ఆత్మనిర్భర్  లక్ష్య సాధనలో ఇంటింటి వాడకపు వస్తువుగా మారుతుంది. ఇందులో భాగంగా కళాకారులకు శిక్షణ, సువాసన లోను,  ప్యాకేజింగ్ లోను ప్రత్యామ్నాయ వినియోగం,  మార్కెటింగ్ తదితర అంశాల  మద్దతు ఉంటుంది ఈ కార్యక్రమం వల్ల సుమారు 1500 మంది హస్తకళాకారులు లబ్ధి పొందుతారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ఈ కార్యక్రమం ఎగుమతి మార్కెట్ ని కూడా అందుకోగలుగుతుంది. 

*****(Release ID: 1655675) Visitor Counter : 229