జౌళి మంత్రిత్వ శాఖ
కామన్ ఫెసిలిటీ సెంటర్ల (సీఎఫ్‌సీ) ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2020 1:46PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 'జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం' (ఎన్‌హెచ్‌డీపీ), 'సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం'లను (సీహెచ్‌సీడీఎస్) అమలు చేస్తోంది. వీటిలోని
బ్లాక్ లెవల్ క్లస్టర్(బీఎల్‌సీ) కింద ఉన్న నిబంధనల మేరకు చేనేత కార్మికుల యొక్క స్థానిక అవసరాలు తీర్చేలా సాంకేతిక సౌకర్యాల ఏర్పాటుకు గాను 'కామన్ ఫెసిలిటీ సెంటర్లు'ను (సీఎఫ్‌సీ) ఏర్పాటు చేసే వీలుంది. ఇందులో నైపుణ్యతను పెంపొందించడం/ నమూనా అభివృద్ధి / ఉత్పత్తి మొదలైన వాటి కోసం మగ్గం షెడ్, వార్పింగ్, డైయింగ్, నూలు డిపో మరియు స్టోర్ రూమ్ మొదలైనవి ఉండవచ్చు. అవసరమైతే సీఎఫ్‌సీ యొక్క డిజైన్ లేఅవుట్‌ను స్థానిక అవసరాలకు అనుగుణంగా పాక్షికంగా సవరించవచ్చు. సీఎఫ్‌సీ సుమారు 3,000 చదరపు అడుగుల (ఒకటి/ రెండు అంతస్తులలో ఉండవచ్చు) బిల్టప్ ఏరియాను కలిగి ఉండాలి. దీని అంచనా వ్యయం భూమి సమీకరణ వ్యయాన్ని మినహాయించి దాదాపు రూ.50.00 లక్షలకు మించకుండా (ఒక సాధారణ సేవా కేంద్రంతో సహా) ఉండాలి. గుర్తించిన బ్లాక్‌లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలలోని వెలితిని భర్తీ చేయడానికి కూడా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయవచ్చు. అమలు చేసే ఏజెన్సీకి వారి స్వంత భూమి ఉండవచ్చు లేదా ప్రభుత్వ/ ప్రభుత్వ సంస్థ నుండి కనీసం 15 సంవత్సరాలు లీజుకు తీసుకోవచ్చు. సీఎఫ్‌సీ అమలు సంస్థ తమ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వపు సిఫారసుల ఆధారంగా వాటిని పరిశీలిస్తారు. ఆయా ప్రతిపాదనలు ఆమోదించబడితే, నిధులను నేరుగా అమలు చేసే ఏజెన్సీలకు నిధులు విడుదల చేస్తారు. సీఎఫ్‌సీ ఏర్పాటులో భాగంగా నిర్మాణానికి నిధులను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు విడుదల చేయబడతాయి... ఈ సంస్థలు కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు గాను చాలా పారదర్శక బిడ్డింగ్ విధానాన్ని అనుసరించాలి.
సీఎఫ్‌సీలో యంత్రాలు మరియు సామగ్రిని వాటి సొమ్ములతోనే ఏర్పాటు చేయాలి. యంత్రాలు మరియు సామగ్రిని స్థానిక కమిటీ ఖరారు చేస్తుంది. ఆఫీస్ ఇన్-ఛార్జ్ ఆఫ్ వీవర్స్ సర్వీస్ సెంటర్ అధ్యక్షతలోని ఒక కమిటీ వీటిని ఖరారు చేస్తుంది. స్టేట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్‌లూమ్స్ మరియు క్లస్టర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ప్రతినిధిలు ఈ కమిటీలో ఉంటారు. యంత్రాలు మరియు పరికరాల కొనుగోలు కోసం వీవర్స్ సేవా కేంద్రానికి బడ్జెట్ కేటాయింపుగా నిధులు మంజూరు చేయబడతాయి.
కింది ఏజెన్సీలు/ సంస్థలు అమలు ఏజెన్సీలుగా అర్హులు:
- జాతీయ స్థాయి చేనేత సంస్థలు
- రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌లు
- రాష్ట్ర అత్యున్నత చేనేత సహకార సంఘాలు
- కేంద్ర ప్రభుత్వ సంస్థలు
- ప్రాథమిక చేనేత వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ. ఇవి బ్లాక్‌లో భారీగా తన ఉనికి కలిగి ఉండి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడినదై ఉండాలి.
- చట్టపరమైన సంస్థగా నమోదు చేయబడిన స్వయం సహాయక బృందాలు
- ప్రభుత్వేతర సంస్థలు, చేనేత వస్త్రాల కార్యకలాపాలలో నిమగ్నమై ఉండాలి (రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయబడి మరియు డీసీ (చేనేత వస్త్రాలు) ఆమోదించబడి ఉండాలి)
- చేనేత వస్త్రాల కార్యకలాపల కోసం పనిచేసే ఇతర తగిన చట్టపరమైన సంస్థలు (రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయబడి మరియు డీసీ (చేనేత వస్త్రాలు) ఆమోదించబడి ఉండాలి)
ఈ సమాచారాన్ని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 1655657)
సందర్శకుల సూచీ సంఖ్య : : 201