రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రక్షణ సర్వీసులలో కోవిడ్-19 కేసులు

प्रविष्टि तिथि: 16 SEP 2020 5:03PM by PIB Hyderabad

సైన్యంలో 16758, నావికా దళంలో 1365, వైమానిక దళంలో 1716 కోవిడ్-19  కేసులు నమోదయ్యాయి.

కోవిడ్-19 కారణంగా సైన్యంలో 32 మంది, వైమానిక దళంలో ముగ్గురు మరణించగా, నావికాదళంలో మరణాలేవీ నమోదు కాలేదు.

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సర్వీసులో ఉండగా ఇన్ఫెక్షన్ వలన వచ్చే వ్యాధులతో మరణించినవారికి పరిహారం ఇచ్చే వెసులుబాటు ఏదీ లేదు. అయితే, సర్వీసులో ఉండగా మరణించేవారికి మాత్రం అంతిమంగా ఇచ్చే ప్రయోజనాలు అందుతాయి.

రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద నాయక్ ఈ రోజు లోక్ సభలో సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఇచ్చిన సమాచారం ఇది.

 ***


(रिलीज़ आईडी: 1655450) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Manipuri , Punjabi , Tamil