ప్రధాన మంత్రి కార్యాలయం

చ‌రిత్రాత్మక కోసీ రైల్ మ‌హాసేతు ను దేశానికి అంకితం చేయ‌నున్న ప్రధాన‌ మంత్రి

ప్ర‌యాణికుల సౌకర్యార్థం బిహార్‌ లో కొత్త రైలుమార్గాలను, విద్యుదీక‌ర‌ణ‌ పథకాలను ఆయన ప్రారంభించ‌నున్నారు

Posted On: 16 SEP 2020 6:00PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చ‌రిత్రాత్మ‌క కోసీ రైల్ మ‌హాసేతు ను 2020 సెప్టెంబ‌ర్ 18న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశప్రజలకు అంకితం చేయ‌నున్నారు. 

దీనికి తోడు, బిహార్ రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా ప్ర‌యాణికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి 12 రైలు ప్రాజెక్టుల‌ను కూడా ప్ర‌ధాన‌ మంత్రి ప్రారంభించ‌నున్నారు. కియుల్ న‌ది పై కొత్త గా నిర్మించిన ఒక రైలు వంతెన, రెండు కొత్త రైలు మార్గాలు, 5 విద్యుదీక‌ర‌ణ ప్రాజెక్టులు, ఒక ఇలెక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్‌, బ‌ఢ్-బఖ్తియార్‌ పుర్ నడుమ మూడో కొత్త లైను ప్రాజెక్టు లు వీటిలో భాగం గా ఉన్నాయి. 

కోసీ రైల్ మ‌హాసేతు ను దేశ ప్రజలకు అంకితం చేయ‌డం బిహార్ చ‌రిత్ర‌ లో ఒక పెద్ద మలుపు మాత్రమే కాకుండా యావత్తు ఈశాన్య ప్రాంత  రాష్ట్రాల‌తో సంధానానికి కూడా చరిత్రాత్మకం కానుంది.

1887లో నిర్మలీ, భాపతియాహీ (స‌రాయాగఢ్) ల మ‌ధ్య మీట‌ర్‌ గేజ్ లైను ను ఆరంభించడం జరిగింది.  అయితే 1934 లో వచ్చిన భయానక వరద, భార‌త్- నేపాల్ లో సంభవించిన భూకంపం కార‌ణం గా ఈ రైలు మార్గం ధ్వంసం అయింది. కోసీ న‌ది ప్ర‌వాహం తీరుతెన్నుల‌ కార‌ణంగా ఈ రైలు మార్గాన్ని పున‌రుద్ధ‌రించే దిశ లో చాలా కాలం పాటు ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేపట్టడం జ‌ర‌గ‌లేదు. 

2003-2004 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కోసీ మహా సేతు ప్రాజెక్టు ను మంజూరు చేసింది. కోసీ రైల్ మెగా బ్రిడ్జి పొడ‌వు 1.9 కిలోమీట‌ర్లు. దీని నిర్మాణానికి 516 కోట్ల రూపాయ‌లు ఖర్చయింది. భారత్- నేపాల్ స‌రిహ‌ద్దు కు దగ్గరగా ఉండడం వల్ల ఈ వంతెన వ్యూహాత్మ‌కం గా ఎంతో కీల‌క‌మైంది. ఈ ప్రాజెక్టు కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో పూర్తి అయింది. దీని నిర్మాణం లో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వ‌ల‌స కార్మికులు కూడా పాలుపంచుకున్నారు. 

ఈ ప్రాజెక్టును జాతి కి అంకితం చేయ‌డం తో ఈ ప్రాంత ప్ర‌జ‌ల 86 సంవ‌త్స‌రాల క‌ల నెర‌వేర‌నుంది; వారి దీర్ఘకాల స్వప్నం సాకారం కాబోతోంది. మ‌హాసేతు ను ప్ర‌ధాన‌ మంత్రి జాతికి అంకితం చేయ‌డంతో పాటు సుపౌల్ స్టేష‌న్ నుంచి స‌హ‌ర్ సా- ఆస‌న్‌ పుర్ కుఫా డెమో ట్రయిన్ కు కూడా పచ్చజెండా ను చూపించి ఆ రైలు ప్రయాణాన్ని ప్రారంభించ‌నున్నారు.  ఈ మార్గం లో ఒక‌సారి రెగ్యుల‌ర్ రైలు స‌ర్వీసులు ప్రారంభ‌ం అయ్యాయంటే, అప్పుడు  సుపౌల్‌,అరరియా, స‌హ‌ర్ సా జిల్లాల‌ ప్రజలకు ఈ మార్గం ఎంతో ప్ర‌యోజ‌న‌కారి అవుతుంది. ఈ ప్రాంత ప్ర‌జ‌లు కోల్‌కాతా, దిల్లీ, ముంబయి ల వంటి బహుదూర ప్రాంతాల‌కు వెళ్లడానికి, ఆయా ప్రాంతాల నుంచి తిరిగి రావడానికి సుల‌భతరం అయిపోతుంది. 

ప్రధాన‌ మంత్రి హాజీపుర్-ఘోస్ వార్‌-వైశాలీ, అలాగే ఇస్లాంపుర్‌- నాతేశ‌ర్ అనే రెండు కొత్త రైల్ లైన్ ప్రాజెక్టుల‌ను కూడా ప్రారంభించ‌నున్నారు. శ్రీ మోదీ క‌ర్ నౌతీ- బఖ్తయార్‌ పుర్ లింక్ బైపాస్‌, బ‌ఢ్-బఖ్తియార్‌ పుర్ మ‌ధ్య మూడో లైను ను సైతం  ప్రారంభిస్తారు.

ముజ‌ప్ఫర్‌ పుర్‌- సీతామ‌ఢీ, క‌టిహార్‌- న్యూ జ‌ల్ పాయిగుడీ, స‌మ‌స్తీపుర్ -ద‌ర్భంగా-జ‌య‌న‌గ‌ర్‌, స‌మ‌స్తీపుర్‌-ఖ‌గడియా, భాగ‌ల్ పుర్- శివ‌నారాయ‌ణ్‌ పుర్ సెక్ష‌న్ల విద్యుదీక‌ర‌ణ తో జతపడ్డ ప్రాజెక్టును కూడా ప్ర‌ధాన‌ మంత్రి ప్రారంభించ‌నున్నారు.


***


(Release ID: 1655443) Visitor Counter : 199