వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

చైనా ఉత్పత్తులపై నిషేధం

Posted On: 16 SEP 2020 4:30PM by PIB Hyderabad

అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం మరియు ఆర్థిక అంశాల ఆధారంగా దేశం యొక్క దిగుమతి విధానాన్ని ప్రభుత్వం క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. జాతీయ మరియు ప్రజా ప్రయోజనాల అంచనా ఆధారంగా దిగుమతులను నియంత్రించే నిర్ణయాల్ని ప్ర‌భుత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం విదేశీ వాణిజ్య విధానం కింద సుమారు 550 టారిఫ్ లైన్లు ‘పరిమితం’ / ‘నిషేధించబడిన’ కేటగిరీలో ఉన్నాయి. దిగుమ‌తులు ప‌రిమితం చేయ‌బ‌డిన వాటిలో అన్ని దేశాల‌తో పాటుగా చైనా ఉత్ప‌త్తులు కూడా ఉన్నాయి. ఆత్మ నిర్భ‌ర్‌ భారత్ దృష్టి కోణానికి అనుగుణంగా దేశీయ సామర్థ్యాలకు త‌గిన మద్దతు ఇవ్వడానికి మరియు విస్తరించడానికి, మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్స్ భాగాలు మరియు బల్క్ డ్రగ్స్ మరియు మెడికల్ పరికరాల రంగాలతో సహా వివిధ‌ వ్యాపార మరియు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు (పీఎల్‌ఎస్) ద్వారా దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధానాలను అమలు చేసింది. ప‌రిశ్ర‌మ‌‌పై ఈ ప్రోత్సాహ‌క చ‌ర్య‌ల పూర్తి ప్ర‌భావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న త‌రువాత త‌గిన విధంగా ప్ర‌స్ఫుట‌మ‌వుతుంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని వెల్ల‌డించారు.  
                               

 ***



(Release ID: 1655438) Visitor Counter : 151