హోం మంత్రిత్వ శాఖ

దక్షిణాదిరాష్ట్రాలలో ఇస్లామిక్ టెర్రరిస్టులు

Posted On: 16 SEP 2020 3:25PM by PIB Hyderabad

దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) లో చేరిన సంఘటనలు కేంద్ర, రాష్ట్ర భద్రత సంస్థల దృష్టికి వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్య సభ లో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. దక్షణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలో ఐఎస్ కు సంబంధించిన 17 కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ నమోదు చేసి 122 మంది నిందితులను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్/ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/ధానిష్/ఇస్లామిక్ స్టేట్ ఇన్ కొరసన్ ప్రావిన్స్ (ఐఎస్ కెపి)/ఐఎస్ఐఎస్ విలాయత్ కొరాసన్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ షామ్-కొరాసన్ (ఐఎస్ఐఎస్-కె) లతో పాటు, వాటి అనుబంధ సంస్థల ను కేంద్ర ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధం) చట్టం 1967 లోని ఒకటో షెడ్యూల్ లో చేర్చడంతో పాటు, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం జరిగిందని ఆయన వివరించారు. ఐఎస్ తన సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి ఇంటర్ నెట్ ఆధారిత సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకొంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో సంబంధిత ఏజెన్సీలు సైబర్ స్పేస్ ను నిశితంగా పరిశీలిస్తున్నాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి తన సమాధానంలో వివరించారు.

 

ఎన్ఐఎ జరిపిన దర్యాప్తులలో ఐఎస్ కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లతో పాటు, జమ్ము, కశ్మీర్ లలో చాలా చురుకుగా ఉన్న సంగతి వెలుగులోకి వచ్చిందన్నారు.

 

****


(Release ID: 1655144) Visitor Counter : 172