పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

నిర్దేశిత లక్ష్యాన్ని సాధించిన ఉజ్జ్వలయోజన

Posted On: 16 SEP 2020 1:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎంయువై) కి నిర్దేశించిన లక్ష్యాన్ని గత సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన సాధించడం జరిగిందని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్య సభ కు తెలిపారు. ఒక ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, పేద కుటుంబాలలోని వయోజన మహిళలకు డిపాజిట్ చెల్లించనక్కరలేకుండానే ఎల్.పి.జి కనెక్షన్ లను అందించడానికి 2016 మే 1న ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన ను ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ పథకం లో భాగంగా 2016-17 లో 200.3 లక్షల ఎల్.పి.జి కనెక్షన్లను ఇవ్వగా, 2017-18 లో 155.7 లక్షల కనెక్షన్లను, 2018-19 లో 362.9 లక్షల కనెక్షన్లను విడుదల చేసినట్లు మంత్రి సభకు తెలియజేశారు.

కరోనా సంక్షోభ కాలంలో పిఎంయువై లో భాగంగా సిలిండర్ల బట్వాడా కొనసాగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో పిఎంయువై లాభితులకు అందించిన సిలిండర్ రీఫిల్ ల వివరాలను, అందుకు ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం వారీగా అనుబంధ సమాచారంలో పొందుపరచినట్లు మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.

 

 

***



(Release ID: 1655138) Visitor Counter : 237