పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

పీఎన్‌జీ & సీఎన్‌జీ దిగుమతి మరియు అంతర్గత ఉత్పత్తి

Posted On: 16 SEP 2020 1:25PM by PIB Hyderabad

'పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్' (పీపీఏసీ) అందించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది (2020) ఏప్రిల్-జులై మధ్య కాలంలో దేశీయంగా సుమారు 9,228 ఎంఎంఎస్‌సీఎంల‌
సహజ వాయువు ఉత్పత్తి చేయబడింది. దేశంలో సుమారు 9,966 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్‌జీ
దిగుమతి చేసుకోవ‌డ‌మైంది. ఈ వాయువు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) మరియు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) యొక్క డిమాండ్‌‌ను తీరుస్తోంది.
ఐఓసీఎల్ 517 కిలోమీటర్ల పొడవైన పారాదీప్-హల్దియా-బరౌని ఆయిల్ 30" సామర్థ్యం పెంపు పైప్‌లైన్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప‌నుల్లో 31.08.2020 నాటికి 43.4 శాతం మేర‌ భౌతిక పురోగతి సాధించినట్లు ఐఓసిఎల్ తెలియజేసింది. అంతే కాకుండా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ప‌శ్చిమ బెంగాల్‌, ఒఢిషా మ‌రియు అస్సాం రాష్ట్రాలను అనుసంధానించడానికి గాను బరౌని-గౌహతి పైప్‌లైన్ (బీజీపీఎల్) మరియు ధమ్రా-హల్దియా (డీహెచ్‌పీఎల్) పైప్‌లైన్‌ల‌
విస్తరణల‌తో జగదీష్‌పూర్-హల్దియా-బొకారో-ధమ్రా పైప్‌లైన్ (జేహెచ్‌బీడీపీఎల్‌) ప‌నుల‌ను గెయిల్ అమలు చేస్తోంది. సుమారు 2,655 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్‌ ప్రస్తుతానికి 1,401 కిలోమీటర్ల మేర పూర్త‌యినట్లుగా‌ గెయిల్ తెలిపింది. ప్ర‌స్తుత ప‌రిస్థ‌తిని గురించి ఇంద్రధనుష్ గ్యాస్ గ్రిడ్ లిమిటెడ్ (ఐజీజీఎల్) వివ‌రిస్తూ.. భారత ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్‌కు (వీజిఎఫ్) ఆమోదించినట్టుగా తెలిపింది. అంటే ఇది దాదాపు రూ.5,559 కోట్ల‌కు స‌మానం. 08.01.2020న తాము మెస్స‌ర్స్ మెకాన్ సంస్థ‌ను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా (పీఎంసీ) నియ‌మించుకున్న‌ట్టు వెల్ల‌డించింది. పీ అండ్ ఎంపీ చట్టం- 1962 ప్రకారం భూసేకరణకు గాను అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్‌ల‌లో సమర్థులై సంబంధిత‌ అధికారులను నియమించ‌డ‌మైంది. పీఎంపీ చ‌ట్టం-1962, సెక్షన్ -3 (1) ప్ర‌కారం అస్సాం & త్రిపురల‌లో నోటిఫికేష‌న్ జారీ ప్ర‌క్రియ పూర్త‌యింది. దీనికి తోడు అనేక ఇతర ప్రాజెక్ట్ ముంద‌స్తు పనులు కూడా జరుగుతున్నాయి.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్ర‌శ్న‌కు లిఖితపూర్వక సమాధానంగా ఈ స‌మాచారాన్ని అంద‌జేశారు.
                               

*****



(Release ID: 1655045) Visitor Counter : 86