సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులకు సంబంధించిన వివిధ విధానపరమైన నిర్ణయాలపై ప్రభావం చూపనున్న లింగమార్పిడి వ్యక్తుల జాతీయ మండలి

Posted On: 16 SEP 2020 1:11PM by PIB Hyderabad

లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తుల(హక్కుల పరిరక్షణ),చట్టం 2019. ఈ చట్టంలోని VII చాప్టర్ ప్రకారం లింగ మార్పిడి వ్యక్తుల జాతీయ మండలిలో ఇతర సభ్యులతోపాటు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి  వారి వర్గానికి చెందిన 5గురు వ్యక్తుల రొటేషన్ సభ్యులుగా ఉంటారు మరియు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఆ రంగంలో నిపుణులైన 5గురు వ్యక్తులు లేదా లింగ మార్పిడి వ్యక్తుల సంక్షేమం కోసం పనిచేస్తన్న వ్యక్తులను సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ మండలిలోని సభ్యులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఈ వర్గానికి చెందిన వారికి సంబంధించిన వివిధ చట్టపరమైన నిర్ణయాలపై ప్రభావం చూపుతారు. ఈ చట్టాన్ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అమలులోనికి తెచ్చింది.

లింగ  మార్పిడి చేయించుకున్న వ్యక్తుల పట్ల తప్పుగా ప్రవర్తించడం నేరం ఇందుకు జరిమానా ఉంటుందని  ఈ చట్టంలోని క్లాజ్ 18 తెలుపుతున్నది. లింగ మార్పిడి వ్యక్తుల జాతీయ మండలి వారి సాధకబాధకాలను తెలుసుకుని నివారించడం ఈ మండలి విధి. ఈ చట్టంలోని అంశాలు ఇప్పటికే అమలులో ఉన్న చట్టానికి అదనంగా చేకూర్చినవే కానీ వేటికీ ప్రత్యామ్నాయం కాదు.

ఈ చట్టంలోని 19వ క్లాజు ప్రకారం పార్లమెంటులో చేసిన ఈ  చట్టాన్నానుసరించి జాతీయ మండలి తన విధులను నిర్వర్తించడం కోసం అవసరమైన నిధులను  కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమకూర్చవలసి ఉంటుంది.

ఈ రోజు రాజ్యసభలో కేంద్ర సామజిక న్యాయం మరియు సాధికారతా మంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలోని సమాచారం

 
***

(Release ID: 1655044) Visitor Counter : 268