ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి తీరుతెన్నులు
Posted On:
15 SEP 2020 2:58PM by PIB Hyderabad
కోవిడ్ -19 వ్యాధినుంచి కాపాడేందుకు సురక్షితమైన, సమర్ధవంతమైన వ్యాక్సిన్ వీలైనంత త్వరగా లభ్యమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ అభివృద్ధిలో ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా ఇంకా ఎంత కాల పడుతుందో చెప్పడం కష్టం.
కోవిడ్ -19 వ్యాక్సిన్ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నీతి ఆయోగ్ సభ్యుడు అధ్యక్షత మరియు కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సహాధ్యక్షత వహిస్తారు. ఇంకా విదేశాంగ మంత్రిత్వ శాఖ, బయో టెక్నాలజీ శాఖ, ఆరోగ్య పరిశోధనా శాఖ కార్యదర్శులు , కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్, భారత వైద్య పరిశోధనా మండలిలో ఈ సి డి అధిపతి, జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యువేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (సభ్యుడు ఎన్ టి ఏ జి ఐ) మరియు రాష్ట్రాలు & వ్యయం విభాగం ప్రతినిధులుగా ఉంటారు. వ్యాక్సిన్ బట్వాడా, సరైన వ్యాక్సిన్ ఎంపిక, సేకరణ, బృందాల ప్రాధాన్యికరణ, వ్యూహ రచన, శీతల గిడ్డంగుల ఆవశ్యకత, ఆర్ధిక అంశాలు మరియు జాతీయ / అంతర్జాతీయ వాటాల వంటి అంశాలను బృందం పరిశీలిస్తుంది.
కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రయోగాలు, ఉత్పత్తి , వైద్యచికిత్స సంబంధ పరీక్షలు, విశ్లేషణ కోసం ఇండియాలో ఈ దిగువ ఔషధ ఉత్పత్తి సంస్థలకు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ పరీక్ష లైసెన్సులను మంజూరు చేసింది.
మెసర్స్ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పూణే
మెసర్స్ కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్, అహమ్మదాబాద్
మెసర్స్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్
బయోలాజికల్ ఈ. లిమిటెడ్ , హైదరాబాద్
మెసర్స్ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి
మెసర్స్ అరబిందో ఫార్మా లిమిటెడ్, హైదరాబాద్
మెసర్స్ జెనోవా బయోఫార్మస్యుటికల్స్ లిమిటెడ్, పూణే
ఇండియాలో ఈ దిగువ కంపెనీలు కోవిడ్-19 వ్యాక్సిన్లకు సంబంధించిన చికిత్సా పరీక్షలు జరుపుతున్నాయని ఆరోగ్య పరిశోధనా శాఖ పరిధిలో ఉన్న స్వతంత్ర సంస్థ భారత వైద్య పరిశోధనా మండలి (ఐ సి ఎం ఆర్) తెలిపింది.
(i) పూణేకు చెందిన ఐ సి ఎం ఆర్ పరిధిలోని జాతీయ వైరస్ శాస్త్రాల సంస్థ వేరుపరచి ఇచ్చిన వైరస్ కణజాలం ఉపయోగించి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ బిబివి152 పేరుతో వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉంది. అంతకు ముందు వేరుపరచిన వైరస్ కణజాలం క్షమతను ఎలుకలు, చిట్టెలుకలు మరియు కుందేళ్లపై పరీక్షించి చూశారు.
మొదటి దశ చికిత్సా పరీక్షలతో పాటు పెద్ద జంతువులపై సమాంతర అధ్యయనం కూడా పూర్తయ్యింది. తయారీలో ఉన్న వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అది ఎంతో సురక్షితమైనదని ఈ పరీక్షల ద్వారా రుజువైంది.
రెండవ దశ చికిత్సా పరీక్షలు కొనసాగుతున్నాయి.
(ii) కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ జైకొవ్ -డి అనే డిఎన్ ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. దానిని చికిత్సా పరీక్షలకు ఉపయోగించడానికి ముందు ఎలుకలు, చిట్టెలుకలు, కుందేళ్లు, సీమపందికొక్కు వంటి చిన్న జంతువులపై ప్రయోగించి వాటిలో విషపూరిత కణాలు ఏవైనా ఉన్నాయేమో శోధించి చూశారు. వ్యాక్సిన్ సురక్షితమైనదని మరియు వ్యాధి నిరోధకతను పెంపొందీస్తుందని కనుగొన్నారు.
చికిత్సకు ముందు వ్యాక్సిన్ గురించి పెద్ద జంతువులపై సమాంతర అధ్యయనం జరిపేందుకు క్యాడిలా సంస్థ ఐసిఎంఆర్ తో భాగస్వామిగా చేరింది.
చికిత్సా పరీక్షల తీరు ఈ విధంగా ఉంది:
మొదటి దశ చికిత్సా పరీక్షలు పూర్తయ్యాయి. తయారీలో ఉన్న వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనదని శోధనలో తేలింది. వ్యాక్సిన్ వ్యాధి నిరోధకతను ఏ విధంగా పెంపోందిస్తుందో తెలుసుకోవడానికి పరీక్షలు కొనసాగుతున్నాయి.
రెండవ దశ చికిత్సా పరీక్షలు కొనసాగుతున్నాయి.
(iii) సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఐసిఎంఆర్ భాగస్వామ్యంలో చికిత్సలో ఉపయోగించడానికి అనువైన రెండు రకాల వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నారు.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడవ దశ చికిత్సా పరీక్షలు బ్రెజిల్ లో జరుపుతున్నారు. వ్యాక్సిన్ కు సంబంధించిన రెండవ / మూడవ దశ అధ్యయనంలో ఇంకా మిగిలిపోయిన లోటును భర్తీ చేసేందుకు చెన్నైకి చెందిన జాతీయ క్షయ పరిశోధనా సంస్థ నేతృత్వంలో ఐసిఎంఆర్ 14 చోట్ల చికిత్సా పరీక్షలు నిర్వహిస్తోంది.
అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను చికిత్సా పరమైన అభివృద్ధి కోసం ఐసిఎంఆర్ మరియు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంలో కృషి జరుగుతోంది. సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ తయారు చేసిన తరువాత అక్టోబర్ నెల ద్వితీయార్ధంలో చికిత్సా శోధన ప్రారంభిస్తారు. ఐసిఎంఆర్ - పూణేకు చెందిన జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ (ఎన్ ఏ ఆర్ ఐ) శోధనకు నాయకత్వం వహిస్తాయి.
బయో టెక్నాలజీ శాఖ (డి బి టి) / శాస్త్ర విజ్ఞాన మరియు సాంకేతిక శాఖ (డి ఎస్ టి) వెల్లడించిన వివరాల ప్రకారం 30 కన్నా ఎక్కువ రకాల వ్యాక్సిన్లు ఇప్పుడు తయారీలో ఉన్నాయి. వాటి అభివృద్ధి వివిధ దశల్లో కొనసాగుతోంది.
వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలు మరియు అధ్యయనాల కోసం ఐసిఎంఆర్ రూ. 25 కోట్లు కేటాయించింది.
శాస్త్ర విజ్ఞాన మరియు ఇంజనీరింగ్ పరిశోధన బోర్డు (ఎస్ ఈ ఆర్ బి) కోవిడ్ -19 వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించి మూడు ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ. 22,27,579/- మంజూరు చేశారు. మొత్తం మీద దీని కోసం రూ. 3,20,78,161/-. ఇస్తామని వాగ్దానం చేశారు.
పారిశ్రామిక వర్గాలు, విద్యా సంస్థలు అందజేసిన 8 వ్యాక్సిన్ తయారీ ప్రతిపాదనలకు బయో టెక్నాలజీ శాఖ మద్దతు ఇచ్చింది. ఈ పరిశోధనలకు మొత్తం రూ. 75 కోట్లు వ్యయం కాగలదని అంచనా.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1654736)
Visitor Counter : 215