మంత్రిమండలి
బీహార్‌లోని దర్భంగా వద్ద కొత్త అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు ఆమోదం తెలిపిన - కేంద్ర మంత్రి మండలి
Posted On:
15 SEP 2020 2:22PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి, బీహార్‌లోని దర్భంగా లో కొత్త అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పి.ఎమ్ .ఎస్.ఎస్.వై) కింద ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. పైన పేర్కొన్న ఎయిమ్స్ కోసం 2,25,000 రూపాయల (స్థిరమైన) బేసిక్ వేతనంతో పాటు ఎన్.పి.ఎ.తో (అయితే ఈ వేతనం, ఎన్.పి.ఎ. కలిసి 2,37,500 రూపాయలు మించకుండా) ప్రాథమిక వేతనంలో డైరెక్టర్ పదవిని రూపొందించడానికి కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఇందుకోసం మొత్తం 1264 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారత ప్రభుత్వం ఆమోదించిన తేదీ నుండి 48 నెలల వ్యవధిలో పూర్తయ్యే అవకాశం ఉంది.
సామాన్య ప్రజలకు ప్రయోజనాలు / ముఖ్యాంశాలు :
* కొత్త ఎయిమ్స్ 100 యు.జి. (ఎమ్.బి.బి.ఎస్.) సీట్లు మరియు 60 బి.ఎస్.సి. (నర్సింగ్) సీట్లను జోడిస్తుంది.
* కొత్త ఎయిమ్స్ లో 15 - 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి.
* కొత్త ఎయిమ్స్ లో 750 ఆసుపత్రి పడకలు ఉంటాయి.
* ప్రస్తుతం పనిచేస్తున్న ఎయిమ్స్ యొక్క డేటా ప్రకారం, ప్రతి కొత్త ఎయిమ్స్ రోజుకు సుమారు 2000 మంది ఓ.పి.డి. రోగుల అవసరాలను, నెలకు 1000 మంది ఐ.పి.డి. రోగుల అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు.
* పి.జి. మరియు డి.ఎం. / ఎమ్.సి.హెచ్. సూపర్-స్పెషాలిటీ కోర్సులు కూడా త్వరలో ప్రారంభంకానున్నాయి.
ప్రాజెక్టు వివరాలు:
కొత్త ఎయిమ్స్ స్థాపనలో ఆసుపత్రి, వైద్య, నర్సింగ్ కోర్సుల కోసం టీచింగ్ బ్లాక్, నివాస సముదాయాలు, అనుబంధ సౌకర్యాలు, సేవలు, మొదలైనవన్నీ, ఎయిమ్స్, న్యూఢిల్లీ తరహాలో ఏర్పాటుచేయడం జరుగుతుంది. పి.ఎం.ఎస్.ఎస్.వై. మొదటి దశ కింద మరో ఆరు కొత్త ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాంతంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, నర్సింగ్ విద్య మరియు పరిశోధనలను అందించడానికి కొత్త ఎయిమ్స్ ను జాతీయ ప్రాముఖ్యత గల ఒక సంస్థగా ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.
ప్రతిపాదిత సంస్థలో 750 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి ఉంటుంది. ఇందులో అత్యవసర / ట్రామా పడకలు, ఐ.సి.యు పడకలు, ఆయుష్ పడకలు, ప్రైవేట్ పడకలతో పాటు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పడకలు ఉంటాయి. వీటికి అదనంగా, వైద్య కళాశాల, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, నైట్ షెల్టర్, అతిధి గృహం, వసతి గృహాలతో పాటు నివాస సౌకర్యాలు కూడా ఉంటాయి. కొత్త ఎయిమ్స్ స్థాపన మూలధన ఆస్తులను సృష్టిస్తుంది, దీని కోసం ఆరు కొత్త ఎయిమ్స్ యొక్క నమూనా ఆధారంగా, వాటి కార్యకలాపాలు మరియు నిర్వహణ కోసం అవసరమైన ప్రత్యేకమైన మానవశక్తి కూడా సృష్టించబడుతుంది. ఈ సంస్థలపై పునరావృతమయ్యే ఖర్చు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క పి.ఎం.ఎస్.ఎస్.వై. యొక్క ప్లాన్ బడ్జెట్ హెడ్ నుండి వారికి గ్రాంట్-ఇన్-ఎయిడ్ ద్వారా సమకూర్చడం జరుగుతుంది.
ప్రభావం:
కొత్త ఎయిమ్స్ ఏర్పాటు ఆరోగ్య విద్య మరియు శిక్షణను మార్చడమే కాక, ఈ ప్రాంతంలోని ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరతను కూడా పరిష్కరిస్తుంది. కొత్త ఎయిమ్స్ ఏర్పాటు జనాభాకు సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సంరక్షణను అందించడంతో పాటు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం) కింద సృష్టించబడుతున్న ప్రాధమిక మరియు ద్వితీయ స్థాయి సంస్థలు / సౌకర్యాల కోసం అందుబాటులో ఉన్న ఈ ప్రాంతంలో వైద్యులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తల పెద్ద జాబితాను సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. కొత్త ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. కొత్త ఎయిమ్స్ యొక్క కార్యకలాపాలు మరియు నిర్వహణ ఖర్చులను కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
ఉపాధి కల్పన:
రాష్ట్రంలో కొత్త ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల వివిధ బోధన, బోధనేతర ఉద్యోగాల్లో దాదాపు 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంకా, ఈ కొత్త ఎయిమ్స్ పరిసరాల్లో వచ్చే షాపింగ్ సెంటర్, క్యాంటీన్లు మొదలైన సౌకర్యాలు మరియు సేవల కారణంగా అనేకమందికి పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఎయిమ్స్ దర్భాంగా కోసం భౌతిక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు కూడా నిర్మాణ దశలో గణనీయమైన ఉపాధిని కల్పిస్తామని భావిస్తున్నారు.
ఇది ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మధ్య అంతరాలను తగ్గించడంతో పాటు రాష్ట్ర మరియు పరిసర ప్రాంతాలలో నాణ్యమైన వైద్య విద్యకు సౌకర్యాలను నింపుతుంది. ఎయిమ్స్ చాలా అత్యవసరమైన సూపర్ స్పెషాలిటీ / ఆరోగ్య సంరక్షణను సరసమైన ఖర్చులతో, అవసరమైన వారికీ, నిరు పేదలకు అందించడంతో పాటు, ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ / ఇతర ఆరోగ్య కార్యక్రమాల కోసం శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని కూడా అందుబాటులోకి తెస్తుంది.
ఈ సంస్థ నాణ్యమైన వైద్య విద్యను అందించగల బోధనా వనరులు / అధ్యాపకుల శిక్షణ పొందిన ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది.
*****
(Release ID: 1654602)
Visitor Counter : 240
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam