ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో కొవిడ్-19 వ్యాప్తి గురించి ముందస్తు సూచన
Posted On:
15 SEP 2020 2:59PM by PIB Hyderabad
చైనాలోని వూహాన్ పట్టణంలో వ్యాప్తి చెందుతున్న నిమోనియా లక్షణాలు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత దేశాన్ని 6 జనవరి 2020న హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు చైనాలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య సేవల ప్రధాన సంచాలకులు ఒక పర్యవేక్షక బృందాన్ని నియమించి 8 జనవరి 2020న చైనాలోని పరిస్థితులపై మరియు మన దేశ ప్రజల ఆరోగ్య సంసిద్ధతపై, వ్యాధి వ్యాప్తి నిరోధానికి వివిధ వ్యూహాలను రచించింది.
దేశ వ్యాప్త లాక్డౌన్ విధింపునకు ముందే పరిస్థితులను ఎదుర్కొనడానికి సరియైన చర్యలను తీసుకొనడమైనది.
దేశంలోనికి వ్యాధి ప్రవేశాన్ని నియంత్రించడానికి ఓడ రేవుల్లో, విమానాశ్రాయాల్లో మరియు దేశ సరిహద్దు ప్రాంతాల్లో 18 జనవరి 2020 నుండి వ్యాధి లక్షణాలు గల ప్రయాణీలకులను గుర్తించి వారిని నియంత్రించింది. అలాగే ప్రయాణీకులందరికీ పరీక్షలు నిర్వహించింది. సమగ్ర వ్యాధి నిఘా కార్యక్రమం క్రింద అంతర్జాతీయ ప్రయాణీకుల్లో అనుమానిత మరియు నిరూపితమైన కేసులను గుర్తించడానికి చర్యలను తీసుకుంది. అటువంటి కేసుల్లో రాష్ట్రాలు మరియు జిల్లాల్లో అధిక వ్యాప్తి నియంత్రణకు కంటైన్మెంటు విధానాన్ని మరియు అవరమైన చర్యలను తీసుకుంది. అందుకు గాను ప్రయాణీకులకు నిఘా మార్గదర్శకాలను, కాంటాక్టులను గుర్తించడం, నమూనాల సేకరణ మరియు వాటి రవాణా, చికిత్సా సంబంధిత యాజమాన్యం, విడుదల విధానం, అంటువ్యాధి నివారణ మరియు నియంత్రణ మరియు హోం క్వారంటైన్ విధానం కూడా విడుదల చేయబడింది.
18 జనవరి 2020 నుండి అంతర్జాతీయ ప్రయాణీకులకు స్క్రీనింగ్, నిఘా, కాంటాక్టులను గుర్తించడం కోసం అవసరమైన చర్యలను చేపట్టింది. దేశంలోనికి రాకుండా అంతర్జాతీయ ప్రయాణీకులకు ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొవిడ్-19 ప్రభావం కలిగిన దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు వెంటనే స్క్రీనింగ్ చేపట్టింది. 25 మార్చి 2020 లాక్డౌన్ విధింపునకు ముందు 14,154 విమానాల ద్వారా మొత్తం 15,24,266 మంది ప్రయాణీకులకు విమానాశ్రాల్లో స్క్రీనింగు చేసింది. 12 ప్రధాన విమానాశ్రయాల్లో మరియు 65 చిన్న ఓడ రేవుల్లో మరియు దేశ సరిహద్దులో స్క్రీనింగు జరిపింది. విమానాశ్రయాలకు అదనంగా 16.31 లక్షల మందికి మరియు 86,379 మందిరి 12 ప్రధాన విమానాశ్రయాల్లో మరియు 65 చిన్న ఓడరేవుల్లో మరియు సరిహద్దు ప్రాంతాల్లో స్క్రీనింగు జరిపారు. స్క్రీనింగు ప్రక్రియను కేంద్ర క్రమశిక్షణా బృందాలు పర్యవేక్షించి సందేహాస్పద కేసులను గుర్తించాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ(స్వతంత్ర) మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే ఈ రోజు రాజ్య సభలో వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1654576)
Visitor Counter : 177