పర్యటక మంత్రిత్వ శాఖ

పర్యాటక రంగంలో కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వివిధ చర్యలు తీసుకోబడ్డాయి-కేంద్ర పర్యాటక శాఖా మంత్రి

పర్యాటక స్థలాలు మరియు అక్కడి కార్యక్రమాల గురించిన అవగాహనకు డిజిటల్ మాధ్యమాన్ని పూర్తిగి వినియోగించుకున్నాం: శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 14 SEP 2020 6:33PM by PIB Hyderabad

పర్యాటక రంగంలో కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు:

i.                    కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన రీతిలో భద్రత మరియు పరిశుభ్రతల విషయంలో అవగాహన కల్పించడం మరియు శిక్షణను ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమం పర్యాటక రంగంలో ఆదరణా సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా యూనిట్లు మరల తెరచుకుని వారి వ్యాపారాలను పెంచుకునేందుకు సహకరించే లక్ష్యంతో ప్రారంభించబడింది.

ii.                  హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లు మరియు  పర్యాటక సేవలను అందించువారికి  వారి వ్యాపార నిర్వహణ కోసం 08.06.2020న సూచనలు ఇవ్వబడ్డాయి.

iii.                హోటళ్ళ అనుమతుల గడువు, ఇతర వసతుల ఏర్పట్లకు సంబంధించిన అనుమతులు, ప్రాజెక్టుల  /సవరించిన ప్రాజెక్టుల ఆమోదం, వారి వర్గీకరణకు సంబంధించిన అనుమతుల గడువుద తీరిన లేదా పూర్తికాబోతున్న అనుమతులను 30 సెప్టెంబర్ 2020 నాటి వరకు పొడించడమైనది.

iv.                కొవిడ్-19 అనంతరం హోటళ్ళు, రెస్టారెంట్లు, బి&బిలు మరియు ఇతర యూనిట్లను నడపడానికి మార్గదర్శకాల అమలు కొరకు కేంద్ర మంత్రిత్వ శాఖ సాథి(  సేవల రంగానికి సంబంధించి మూల్య నిర్థారణ, అవగాహన మరియు శిక్షణా పద్ధతులు)ని అభివృద్ధి చేసింది.

v.                  ట్రావెల్ ఏజెంట్ల, టూర్ ఆపరేటర్ల, పర్యాటక రవాణాదారుల గుర్తింపును 6 నెలలు పొడిగించింది కేంద్ర పర్యాటక శాఖ. గుర్తింపు కోసం దరఖాస్తుచేసుకున్న వారికి ప్రక్రియ పూర్తయ్యే వరకు మంత్రిత్వ శాఖ ఆరునెలల తాత్కాలిక గుర్తింపునిచ్చింది.

vi.                భాగస్వాములకు ఆర్థిక సహకారం అందించే విషయంలో మార్కెటింగ్ అభివృద్ధి  సహకార పథకాన్ని సవరించి దాని విస్తృతిని పెంచడానికి మార్గదర్శకాలను రూపొందించనుంది.

vii.              జనవరి 2020లో మంత్రిత్వ శాఖ దేఖో అప్నా దేశ్(డిఏడి) పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశీయ పర్యాటక రంగాన్న ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్న సామాజిక మాధ్యమంలో విస్తృతంగా  ప్రచారం చేయబడింది. ఈ కార్యక్రంలో మన సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రదేశాలు, అక్కడి ఉత్పత్తులలను వెబినార్ సమావేశాల్లో ప్రదర్శించే లక్ష్యంతో రూపొందించబడింది. ప్రజల్లో అవగాహన కల్పించడానికి డాడ్ పై ఆన్లైన్ ప్రతిజ్ఞ మరియు క్విజ్ కార్యక్రమాన్ని మైగవ్.ఇన్ వేదికలో నిర్వహిస్తున్నది.

viii.            దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం మంత్రిత్వ శాఖ వారు ఆయా ప్రాంతాల ఉత్పత్తులు, ఉత్సవాలు, వంటల వంటి వాటిని  సామాజిక మాధ్యమం ద్వారా ప్రోత్సహిస్తున్నది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను ప్రోత్సహించడానికి కార్యక్రమాలను ఏర్పాటుచేస్తుంది. దేశీయ పర్యాటక ప్రదేశాలను లాక్డౌన్ సమయంలో తీసిన కొన్ని ఏరియల్ చిత్రాలను తీసింది.  ఆర్సిఎస్-ఉడాన్ నిధుల ద్వారా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కలపడం కోసం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారులు మంత్రిత్వ శాఖవారితో చర్చలు జరుపుతున్నది.

ఇందుకోసం సాధ్యమైనంత మేరకు సాంకేతకతను వినియోగించుకుంటున్నది కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ. ఇన్క్రెడిబుల్ ఇండియా వేదికగా గూగుల్ వారి 360 డిగ్రీల వాక్- త్రూ సాంకేతికను వినియోగించుకుని పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది. ఈ 360 డిగ్రీల వాక్- త్రూ సాంకేతికను దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ప్రదర్శిస్తున్నది.

ఇన్క్రెడిబుల్ ఇండియా వెబ్ పోర్టల్  మరియు మొబైల్ ఆప్ ద్వారా ఆయా పర్యాటక ప్రాంతాల పూర్తి వివరాలను అందిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్ సర్టిఫికేషన్ కార్యక్రమం(ఐఐటిఎఫ్) ద్వారా ఆన్లైన్ లర్నింగ్ వేదికగా దేశ వ్యాప్తంగా ఉన్న శిక్షణ పొందిన టూరిస్ట్ ఫెసిలిటేటర్లు సాంకేతికతను వినియోగించుకోవాలనే లక్ష్యంతో ప్రారంభించింది. తద్వారా స్థానిక ఉపాధి అవకాశాలను కల్పించడానికి అవకాశం కలుగుతుంది.

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రి(స్వతంత్ర) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు లోక్ సభలో సమర్పించిన వ్రాత ప్రతిగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

 

***



(Release ID: 1654293) Visitor Counter : 169