నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

శిక్షణా కాలంలో భృతి

Posted On: 14 SEP 2020 2:29PM by PIB Hyderabad

వ్యాపార వాణిజ్య వర్గాలతో సహా అన్ని వర్గాల్లో  శిక్షణా కాలంలో ఇచ్చే భృతి కనిష్ట నిష్పత్తిని సవరించి   25 సెప్టెంబర్ 2019న భారత గెజిట్లో  అసాధారణంగా ప్రకటించబడింది. కనీస భృతి ఆయా వర్గాల్లోని విద్యా మరియు సాంకేతిక అర్హతలు మరియు అవసారాన్ని బట్టి ఆయా రంగాల్లో నిర్ణయానుగుణంగా ఉంటుంది. సెప్టెంబర్ 2019లో సవరించిన శిక్షణా భృతి నిబంధన,1992 ప్రకారం శిక్షణా కాలం రెండవ సంవత్సరంలో కనీస భృతిలో 10% పెరుగుదల మరియు మూడవ సంవత్సరం 15% పెరుగుదల ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం అభ్యర్థులకు  శిక్షణా కాలంలో భృతిలో పెరుగుదలను ఇవ్వడం లేదు.  అన్ని వర్గాల వారికి నెల వారీగా ఇవ్వవలసిన శిక్షణా భృతి ఈ క్రింది పట్టికలో

క్ర.సం.

వర్గం

శిక్షణా కాలం మొదటి సంవత్సరంలో నిర్దేశించిన భృతి

(1)

(2)

(3)

(i)

(5వ తరగతి-9వ తరగతి) ఉత్తీర్ణులైన వారు

నెలకు రు. 5000

(ii)

పాఠశాల విద్య(10వ తరగతి)ఉత్తీర్ణులైనవారు

నెలకు రు. 6000

(iii)

పాఠశాల విద్య (12వ తరగతి) ఉత్తీర్ణులైన వారు

నెలకు రు.  7000

(iv)

జాతీయ లేదా రాష్ట్ర ఉత్తీర్ణతా పత్రము కలిగిన వారు

నెలకు రు. 7000

                                      

(v)

టెక్నీషియన్(ఒకేషనల్ అప్రెంటీస్ లేదా ఒకేషనల్ సర్టిఫికేట్ కలిగిన వారు లేదా రెండు కోర్సులకు చెందిన(డిప్లోమా సంస్థలకు చెందిన విద్యార్థులు)వారు  

నెలకు రు.  7000

(vi)

టెక్నీషియన్ అప్రెంటిస్ లేదా ఏ స్ట్రీంలోనైనా డిప్లొమా కలిగిన వారు ఏ సాండ్విచ్ కోర్సు చేసిన వారైనా(డిగ్రీ సంస్థల నుండి వచ్చిన విద్యార్థులు)

నెలకు రు. 8000

(vii)

గ్రాడ్యుయేట్ అప్రెంటీసులు లేదా డిగ్రీ అప్రెంటీసులు లేదా ఏ సబ్జెక్టుల్లోనైనా డిగ్రీ కలిగిన వారు

నెలకు రు.  8000

 

(viii)

 

నైపుణ్య పత్రం కలిగిన వారు 

 

 

a.    అతడు/ఆమె విద్యార్హతలను బట్టి పై పట్టికలో నిర్ణయించిన అర్హతలకు అనుగుణంగా

b.    ఒక వేళ పైన సూచించిన ఏ అర్హతా లేని వారైతే వారికి కనీస భృతి నెలకు రు.5000 లభిస్తుంది

 

 ఈ సమాచారం ఈ రోజు లోక్ సభలో  కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖామాత్యులు శ్రీ ఆర్. కే.సింగ్ వ్రాత ప్రతిగా ఇచ్చిన సమాధానం.


(Release ID: 1654163) Visitor Counter : 290