కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
నూతనంగా నిర్మించిన కార్మికబ్యూరో భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ గంగ్వార్
Posted On:
11 SEP 2020 6:14PM by PIB Hyderabad
చండీఘడ్‌లో నూతనంగా నిర్మించిన కార్మిక బ్యూరో,శ్రమ్‌బ్యూరో భవన్‌ను కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ సహాయమంత్రి శ్రీసంతోష్ కుమార్ గంగ్వార్ 11-09-2020న ప్రారంభించారు. కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీహీరాలాల్ సమార్యా, లేబర్ బ్యూరో డి.జి శ్రీ డిపిఎస్.నెగి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీసంతోష్ కుమార్ గంగ్వార్ కార్మికులకు సంబంధించిన అన్ని రకాల సమాచారం , విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా ఉపయోగపడుతుందని అన్నారు.అందువల్ల కార్మికులకు సంబంధించిన గణాంక వివరాల సేకరణకు ప్రత్యేకంగా లేబర్ బ్యూరో వంటి సంస్థ ఉండడం అవసరమని ఆయన అన్నారు. రాగల రోజులలో డాటా ప్రాథాన్యత మరింత పెరగనున్నదని అంటూ ఆయన, భారతదేశంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని, అందువల్ల కార్మికులకు సంబంధించిన గణాంకాలకు ఈ బ్యూరో ను బలోపేతంచేయడం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.
కార్మిక బ్యూరొ ఈ ఏడాది అన్ని విధాలుగా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్టు శ్రీ గంగ్వార్ చెప్పారు. ఈ బ్యూరో ఏర్పడిన వంద సంవత్సరాల తర్వాత సంస్థ లోగోను ఆవిష్కరించుకోవడంతో పాటు , ఈ సంస్థ నూతన భవనంలోకి ప్రవేశిస్తున్నదని ఆయన అన్నారు. ప్రత్యేకించి ప్రొఫెషనల్ సంస్థలు, ఇంటిపనులు చేసేవారిపై రెండు పెద్ద సర్వేలను ఈ సంస్థకు అప్పగించడం జరిగిందని అన్నారు.ఇటీవల తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లపై డాటాసేకరించే లక్ష్యాన్ని ఈ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు.
హర్యానా కార్మిక శాఖ మంత్రి శ్రీ అనూప్ ధనక్,పంజాబ్ కార్మిక శాఖ మంత్రి శ్రీ బల్బీర్ సింగ్ సిద్దు, హర్యానా డిపార్టమెంట్ ఆఫ్ ఎకనమిక్స్,స్టాటిస్టికల్ అనాలసిస్, హర్యానా కార్మిక శాఖ లేబర్ బ్యూరో తరఫున గతంలో పలు సందర్భాలలో ప్రాంతీయంగా తమ మద్దతునివ్వడంతోపాటు క్షేత్ర స్థాయి పనులను చేపట్టినట్టు తెలిపారు.
జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ బ్యూరోకు ధరల సూరికలు, పాలనాపరమైన గణాంకాలు, కార్మికసంబంధింత సర్వేల గణాంకాలకు సంబంధించి మంచి పేరు ఉంది. కార్మిక బ్యూరో సిపిఐ -ఐడబ్ల్యు ఇండెక్సును నెలవారీ ప్రాతిపదికన తీసుకువస్తుంది. దీనిని కరవు భత్యంనియంత్రణకు , లక్షలాది మంది కార్మికుల వేతనాలకు, దేశంలోని కేంద్ర,రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల వేతనాల విషయంలో ఈ గణాంకాలను వాడుతారు. దీనితోపాటు సిపిఐ -ఐడబ్ల్యు తో పాటు ఈ బ్యోరో సిపిఐ-ఎఎ, ఆర్.ఎల్ ఇండెక్సును రూపొందిస్తుంది. దీనిని గ్రామీణ ప్రాంతాలలో కనీస వేతనాల చట్టం 1948 కింద షెడ్యూల్డు ఉపాధికి,ఎంజిఎన్ ఆర్ిజిఎ వేతనాలకు, మధ్యాహ్న భోజనపథకం కింద వంటఖర్చుల సవరణకు, కనీస మద్దతుధర (సిఎసిపి) , ప్రోక్యూర్‌మెంట్ ను నిర్ణయించడానికి, కాస్ట్ స్టడీస్‌ను అధ్యయనంచేయడానికి,గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని అంచనా వేయడానికి వాడుతారు.
ఈ బ్యూరో కొన్నిరకాల ప్రత్యేక సర్వేలకు కూడా పేరెన్నికగన్నది. ఉదాహరణకు ఆక్యుపేషనల్ వేజ్ సర్వే ఇందులో ఒకటి. వివిధ వృత్తుల వారీగా వేతనాల గణాంకాలను ఆయా రంగాల వారీగా రూపొందించే ఏకైక సంస్థ ఇది. కీలక పాలనాపరమైన గణాంకాలను వివిధ కార్మిక చట్టాల కింద సేకరించి ఉంచే రిపాజిటరీ గా కూడా ఈ బ్యూరో వ్యవహరిస్తుంది.
***
(Release ID: 1653535)
Visitor Counter : 123