ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వైరస్ వ్యాప్తి నిరోధంలో ఈశాన్యరాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొండి: కేంద్రం

8 ఈశాన్య రాష్ట్రాలలో కోవిడ్ నియంత్రణ చర్యల్ని సమీక్షించిన ఆరోగ్య కార్యదర్శి

Posted On: 11 SEP 2020 7:30PM by PIB Hyderabad

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలలో కోవిడ్ వ్యాప్తి నివారణకు అనుసరించిన వ్యూహాలను, తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో   అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఆరోగ్యకార్యదర్శులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ 8 ఈశాన్య రాష్ట్రాలు కలిసి భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులన్నిటిలో  5% కంటే తక్కువ ఉన్నాయి.

ఈ రోజుకు ఈ 8 ఈశాన్య రాష్ట్రాలలో కలిపి చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 29,690  మాత్రమే కాగా అందులో అత్యధికంగా అస్సాం వాటా 68% గా నమోదైంది. త్రిపురలో అతి తక్కువగా 7,383 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం 17% వాటాతో రెండో స్థానంలో ఉంది.

మొత్తం వ్యాధి నిర్థారణ జరిగిన కేసుల సంఖ్య, ప్రస్తుతం చికిత్సలో ఉన్న వారి వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి:

సంఖ్య 

రాష్ట్రం 

 చికిత్సలో ఉన్నవారు

నిర్థారిత కేసులు

మరణాల శాతం

 

 11.09.2020

     నాటికి

 11.09.2020

నాటికి

10.09.2020

నాటికి

గత 24 గంటల్లో

మొత్తం

43747

178032

173978

4054

 

1

అస్సాం

29690

135805

133066

2739

0.3%

2

త్రిపుర

7383

17811

17252

559

0.97%

3

అరుణాచల్ ప్రదేశ్

1658

5672

5545

127

 

0.16%

4

మణిపూర్

1633

7470

7362

108

0.59%

5

మేఘాలయ

1434

3296

3197

99

0.61%

6

నాగాలాండ్

834

4636

4375

261

0.22%

7

మిజోరం

583

1333

1192

141

0%

8

సిక్కిం

532

2009

1989

20

0.35%

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వ్యాధిని అదుపులో ఉంచటానికి తీసుకోవాల్సిన చర్యలను, వ్యాధి నిర్థారణ పరీక్షల సంఖ్య పెంచటం, ఆస్పత్రులలోని బాధితులకు సమర్థంగా చికిత్స అందించటం గురించి కేంద్ర కార్యదర్శి ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రాల కార్యదర్శులు, ప్రతినిధులు ఆ రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితిమీద లోతైన విశ్లేషణ చేశారు. వ్యాధి విస్తరణను నిరోధించటం, వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించటం, నిఘా చర్యలు, చికిత్సాకేంద్రాలవారీగా మరణాలశాతం, వారం వారం వస్తున్న కొత్త కేసుల తీరు, మరణాలు వంటి అంశాలను విశ్లేషించారు. వచ్చే నెలరోజుల కాలానికి అనుసరించబోతున్న వ్యూహాన్ని కూడా వారు వివరించారు.

తమ రాష్ట్రాల్లో జరిపించిన ఆర్ టి -పిసిఆర్ పరీక్షలు, రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు, వాటిలో నెగటివ్ వచ్చినా, లక్షణాలు కనబరచినవారికి పునఃపరీక్షలు, లాబ్ ల వినియోగం, ఆస్పత్రులలో ఉన్నవారి పరిస్థితి, ఆక్సిజెన్ ఆధారిత పడకల ఖాళీలు, ఐసియు పడకలు, వెంటిలేటర్ల వివరాలు ఈ సమీక్ష సందర్భంగా వెల్లడించారు.

ఈ క్రింద పేర్కొన్న అంశాలమీద చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలకు సూచించారు:

*వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవటం, భౌతిక దూరం పాటించేట్టు చూడటం. పరిసరాల నియంత్రణ, ఇంటింటికీ వెళ్ళి వెతకటం

*జిల్లాల్లోను, రాష్ట్రవ్యాప్తంగాను తొలిదశలోనే గుర్తించి పరీక్షలతో నిర్థారించటం, ఆర్ టి - పిసిఆర్ పరీక్షలు ఎక్కువగా జరిపించటం

*ఇళ్లలోనే ఐసొలేషన్ లో ఉంచినవారిని సమర్థవంతంగా పర్యవేక్షించటం, లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆస్పత్రికి తరలించటం

*వైద్య సహాయం అవసరమైనవారిని వెంటనే ఆస్పత్రికి పంపి చికిత్స అందించటం, ముఖ్యంగా వృద్ధుల విషయంలో దీర్ఘకాల వ్యాధులున్నవారి విషయంలో అప్రమత్తంగా ఉండటం

*మరణాల శాతం 1% కంటే తక్కువగా ఉండేట్టు చూడటం  

ఇదే చొరవతో కార్యదర్శులు, ఇతర సిబ్బంది కరోనా సంక్షోభాన్ని అరికట్టటంలో చురుగ్గా వ్యవహరించాలని కేంద్ర కార్యదర్శి కోరారు..

***


(Release ID: 1653504) Visitor Counter : 217