సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రభుత్వం ప్రస్తుత కాలపరిమితిని సడలించింది: డాక్టర్ జితేంద్ర సింగ్
మహమ్మారి సమయంలో వృద్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్న కేంద్ర మంత్రి
Posted On:
11 SEP 2020 4:39PM by PIB Hyderabad
లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రభుత్వం ప్రస్తుత కాలపరిమితిని సడలించి, వృద్ధులకు పెద్ద ఉపశమనం కలిపించిందని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డోనర్), పీఎంఓ, సిబ్బంది, ప్రజాసమస్యలు, పెన్షన్లు, అణువిద్యుత్, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులంతా 2020 నవంబర్ 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు. అంతకుముందు ఇది పెన్షన్ కొనసాగించడానికి నవంబర్ నెలలో మాత్రమే ఉండేది. 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పింఛనుదారులు 2020 అక్టోబర్ 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు. ఈ పొడిగించిన కాలంలో, పెన్షన్ను పెన్షన్ పంపిణీ అధికారులు (పిడిఎ) చెల్లించడం నిరంతరాయంగా కొనసాగుతుంది.
కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి, వృద్ధులకు కరోనా వైరస్ దుర్బలత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కస్టమర్ గుర్తింపును స్థాపించడానికి సమ్మతి-ఆధారిత ప్రత్యామ్నాయ పద్ధతిగా వీడియో-ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (వి-సిఐపి) ను అనుమతించే జనవరి 9, 2020 నాటి ఆర్బిఐ నోటిఫికేషన్ ప్రకారం, పెన్షన్ పంపిణీకి అవకాశాలను బ్యాంకులు కూడా అన్వేషించమని కోరారు. శాఖల వద్ద రద్దీని నివారించడానికి, పెన్షనర్ నుండి ఆర్బిఐ మార్గదర్శకాల ద్వారా అనుమతించిన మేరకు లైఫ్ సర్టిఫికేట్ పొందటానికి ఈ పద్దతి. ప్రతి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ వారి పెన్షన్ మరింత కొనసాగించడానికి నవంబర్ నెలలో జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. పెన్షనర్లు బ్యాంక్ శాఖలను సందర్శించడం ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు, అయినప్పటికీ, పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ప్రోత్సహిస్తోంది, ఇంట్లో నుండి కూడా ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. 2019 లో, చాలా సీనియర్ పెన్షనర్లకు అదనపు సమయాన్ని కేటాయించే చర్యగా, 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పింఛనుదారులకు ప్రతి సంవత్సరం నవంబర్ 1 వ తేదీకి బదులుగా అక్టోబర్ 1 నుండి లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడానికి వీలు కల్పిస్తూ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ నెలలో సాధారణ రద్దీని నివారించడానికి ఈ చొరవ తీసుకున్నారు.
******
(Release ID: 1653498)
Visitor Counter : 266