మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
'21వ శతాబ్దంలో పాఠశాల విద్య' అనే అంశంపై రెండు రోజుల సదస్సు
-'శిక్షక్ పర్వ్' చొరవలో భాగంగా సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న కేంద్ర విద్యాశాఖ
- ఈ నెల 11వ తేదీ జరిగే సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ
- ఉపాధ్యాయులను సత్కరించడానికి, కొత్త విద్యా విధానం -2020ను సగమ్రంగా ముందుకు తీసుకెళ్లడానికి ఈనెల 8 నుండి 25వ తేదీ వరకు 'శిక్షక్ పర్వ్' నిర్వహణ
Posted On:
09 SEP 2020 5:56PM by PIB Hyderabad
'21 వ శతాబ్దంలో పాఠశాల విద్య' అనే అంశంపై కేంద్ర విద్యాశాఖ రెండు రోజుల సదస్సును నిర్వహించనుంది.'శిక్షక్ పర్వ్' చొరవలో భాగంగా సెప్టెంబర్ 10 మరియు 11 తేదీలలో దీనిని ఆన్‌లైన్ మీడియం ద్వారా నిర్వహించనున్నారు. కాన్క్లేవ్ యొక్క మొదటి రోజున ప్రిన్సిపాల్ మరియు టీచర్ ప్రాక్టీషనర్లపై దృష్టి కేంద్రీకరించునున్నారు. వారు ఇప్పటికే ఎన్ఈపీలోని కొన్ని ఇతివృత్తాలను సృజనాత్మక మార్గాల్లో ఎలా అమలు చేశారు అనే అంశంపై చర్చిస్తారు. ఈ నెల 11వ తేదీ జరిగే సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. అంతకుముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆగస్టు 7 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'జాతీయ విద్యా విధానం కింద ఉన్నత విద్యలో పరివర్తన సంస్కరణలపై కాన్క్లేవ్' ప్రారంభోపన్యాసం చేశారు.
రెండు రోజుల్లో పాఠశాల విద్య కోసం ఎన్ఈపీ యొక్క కొన్ని ముఖ్యమైన ఇతివృత్తాలను డీమిస్టిఫై చేయడానికి నిపుణులైన అభ్యాసకులు కాన్క్లేవ్‌లో చర్చించనున్నారు. దీనికి తోడుగా 'మైగోవ్' వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల నుండి అందుకున్న కొన్ని సూచనలు కూడా చర్చల్లో పంచుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులను సత్కరించడానికి, కొత్త విద్యా విధానం -2020 ను ముందుకు తీసుకెళ్లడానికి ఈనెల 8 నుండి 25వ తేదీ వరకు 'శిక్షక్ పర్వ్' నిర్వహణ జరుగుతోంది. ఎన్ఈపీ మరియు దాని అమలుపై విద్యా మంత్రిత్వ శాఖ వరుస వెబ్‌నార్లను నిర్వహించనుంది. ఈ వెబ్‌నార్లలో, ఎన్ఈపీ యొక్క వివిధ ముఖ్యమైన ఇతివృత్తాలు నిపుణులచే చర్చించబడతాయి. ప్రతి థీమ్ విద్యా వ్యవస్థ యొక్క వివిధ రకాల భాగస్వాములను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగనుంది; అయితే, ఇది అన్ని పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు కూడా ఉపకరించనుంది.
****
(Release ID: 1652854)
Visitor Counter : 219