యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌'ను కోల్‌కతాలోని సాయ్‌ ప్రాంతీయ కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించిన పద్మశ్రీ పురస్కార గ్రహీత బులా చౌదరి

Posted On: 09 SEP 2020 6:29PM by PIB Hyderabad

కోల్‌కతాలోని భారత క్రీడల అథారిటీ ‍(సాయ్‌) ప్రాంతీయ కేంద్రం 'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌' నిర్వహించింది. 'నేతాజీ సుభాష్‌ ఈస్టర్న్‌ సెంటర్‌'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్జున, పద్మశ్రీ పురస్కార గ్రహీత బులా చౌదరి పాల్గొన్నారు. బులా చౌదరి, జాతీయ మహిళల ఈత పోటీల మాజీ విజేత. ఐదు సముద్ర మార్గాల్లో ఈదిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌'ను బులా చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. సాయ్‌ ప్రాంతీయ కేంద్రం అధికారులు, కోచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

    రోగనిరోధక శక్తి పెంపొందించే ఏకైన మార్గం ఆరోగ్యమేనని బులా చౌదరి చెప్పారు. "కొవిడ్‌ సమయంలోనే కాదు, తర్వాత పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే, మీ కుటుంబం, మొత్తం దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి రోజూ వ్యాయామం చేయాలి" అని సూచించారు.

    శారీరక శ్రమ, ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి సాయ్‌ కేంద్రం బయట ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. తూర్పు జోన్‌లో ఉన్న అన్ని 'నేషనల్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్' ‍(ఎన్‌సీవోఈ)‌, సాయ్‌ శిక్షణ కేంద్రాలు (ఎస్‌టీసీ), ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాల్లోనూ 'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌' నిర్వహించారు. అవి:
 
1. ఎన్‌సీవోఈ జగత్‌పూర్‌
2. ఎస్‌టీసీ ఆగర్తల
3. ఎస్‌టీసీ బోల్‌పూర్‌
4. ఎస్‌టీసీ బుర్ద్వాన్‌
5. ఎస్‌టీసీ కటక్‌
6. ఎస్‌టీసీ ధేన్‌కనల్‌
7. ఎస్‌టీసీ గిధౌర్‌
8. ఎస్‌టీసీ హజారీబాగ్‌
9. ఎస్‌టీసీ జోల్పాగురి
10. ఎస్‌టీసీ కిషన్‌గంజ్‌
11. ఎస్‌టీసీ లెబాంగ్‌
12. ఎస్‌టీసీ పట్నా
13. ఎస్‌టీసీ పోర్ట్‌ బ్లెయిర్‌
14. ఎస్‌టీసీ రాంచి
15. ఎస్‌టీసీ సుందర్‌గర్‌

***



(Release ID: 1652846) Visitor Counter : 117