రైల్వే మంత్రిత్వ శాఖ

పరివర్తన ప్రయాణంలో భారతీయ రైల్వేలతో సహకరించాలని పరిశ్రమల నాయకులను కోరిన - రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కోరారు.

"ఆత్మ నిర్భర్ రైల్వేల కోసం భాగస్వామ్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం" అనే అంశంపై సి.ఐ.ఐ. రైల్ కనెక్ట్ నుద్దేశించి ప్రసంగించిన - శ్రీ గోయల్.

ఈ సమావేశంలో భారత రైల్వేల కోసం పరివర్తన రోడ్ మ్యాప్ గురించి వివరించిన - రైల్వే బోర్డు ఛైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్.

Posted On: 08 SEP 2020 5:07PM by PIB Hyderabad

భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) ఈ రోజు (2020 సెప్టెంబర్, 8వ తేదీ) రైల్ కనెక్ట్ యొక్క రెండవ ఎడిషన్ ‌ను ఆన్ లైన్ విధానంలో నిర్వహించింది.  ఈ సమావేశంలో భారత రైల్వే యొక్క భవిష్యత్తు ప్రణాళికలు, దేశీయ తయారీ మరియు భారతదేశంలో రైల్వే పరిశ్రమ కోసం సులభతరం వ్యాపారం చేయడం,  ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్ రవాణా రంగంలో ప్రైవేట్ పరిశ్రమకు అభివృద్ధి చెందుతున్న అవకాశాలు,  సాంకేతికత, పట్టణ చైతన్యం, స్టేషన్ అభివృద్ధి, లోకోమోటివ్ ఆధునీకరణ, రైళ్ళ ద్వారా సరుకు రవాణా, కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు రైల్వే వ్యవస్థ యొక్క భద్రత, ఆరోగ్యం మరియు స్థిరత్వం ప్రమాణాలు మొదలైన అంశాలపై దృష్టి సారించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో - రైల్వేలు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్;   రైల్వే బోర్డు ఛైర్మన్, సి.ఈ.ఓ. శ్రీ వినోద్ కుమార్ యాదవ్;  సి.ఐ.ఐ. డైరెక్టర్ జనరల్, శ్రీ చంద్రజిత్ బెనర్జీ తో పాటు పరిశ్రమలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో శ్రీ గోయల్ మాట్లాడుతూ, "భారతీయ రైల్వేలను గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశంలోని వృద్ధి ఇంజిన్ అని అభివర్ణించారు.  రైల్వేతో సంబంధం ఉన్న కాల్పనికవాదాన్ని కొనసాగిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు మంచి సేవా అనుభవంతో వినియోగదారులకు సేవలు అందించే భారతీయ రైల్వేను ఒక బలమైన సంస్థగా మార్చడమే ఆయన అభిమతం.  రైల్వేలో  పరివర్తన జరుగుతోంది.  కోవిడ్ సమయంలో, భారతీయ రైల్వే అడ్డంకులను తొలగించడం, నిర్వహణ, శ్రామిక్ రైళ్లను నడపడం, సరుకు రవాణా వాటాను తిరిగి తీసుకురావడం, ప్రక్రియలను పునరుజ్జీవింపచేయడం, విధాన మార్పులు చేయడం, ప్రైవేట్ రంగాలతో, టెక్నాలజీ ప్రొవైడర్లతో నిమగ్నమవ్వడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అవకాశాలను ఉపయోగించుకుంది." అని చెప్పారు.  భారతీయ రైల్వేలు కర్బన ఉద్గారాలు లేని వ్యవస్థగా మారుతోందని కూడా మంత్రి పేర్కొన్నారు.  సరకు రవాణా రంగంలో తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందించడానికి మరియు రవాణా ఖర్చులను తగ్గించడానికి భారతీయ రైల్వేలతో సహకరించాలని మరియు భాగస్వాములు కావాలని ఆయన పరిశ్రమ నాయకులను కోరారు.  రైల్వే మరియు పరిశ్రమల భాగస్వామ్యంపై ఆత్మ నిర్భర్ రైల్వే ఆధారపడి ఉంటుందని కూడా ఆయన నొక్కి చెప్పారు.

రైల్వే బోర్డు ఛైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆధునికీకరణ, స్వావలంబన మరియు హరిత రైల్వే దిశగా, భారతీయ రైల్వలు తీసుకున్న వివిధ చర్యల గురించి వివరించారు.  భారతీయ రైల్వేల పరివర్తన ప్రణాళికను ఆయన వివరించారు. పరిశ్రమతో సహకారం మరియు భాగస్వామ్యం కోసం భారతీయ రైల్వే ఎదురు చూస్తోందని, ఆయన పేర్కొన్నారు. 

లాక్ డౌన్ కాలంలో రైల్వేలు పోషించిన ముఖ్యమైన పాత్రను మరియు రైల్వేలో గుర్తించదగిన మార్పులను, ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పరిశ్రమల నాయకులు ప్రశంసించారు.

*****



(Release ID: 1652505) Visitor Counter : 145