రక్షణ మంత్రిత్వ శాఖ
'హైపర్సోనిక్ టెక్నాలజీ డెమన్‌స్ట్రేటర్ వెహికల్' విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో
Posted On:
07 SEP 2020 2:56PM by PIB Hyderabad
ఒడిశా తీరం వీలర్ ద్వీపంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుండి 'డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' (డీఆర్‌డీఓ) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు
'హైపర్సోనిక్ టెక్నాలజీ డెమన్‌స్ట్రేటర్ వెహికల్'(హెచ్‌ఎస్‌టీడీవీ) విమాన పరీక్షతో హైపర్సోనిక్ ఎయిర్-బ్రీతింగ్ స్క్రామ్‌జెట్ టెక్నాలజీని విజయవంతంగా ప్రదర్శించింది. హైపర్సోనిక్ క్రూయిజ్ వాహనం నిరూపితమైన ఘన రాకెట్ మోటారును ఉపయోగించి ప్రయోగించారు. దాదాపు 30 కిలో మీటర్ల (కి.మీ.) ఎత్తుకు తీసుకువెళ్ళింది. ఇక్కడ ఏరోడైనమిక్ హీట్ షీల్డ్స్ హైపర్సోనిక్ మాక్ నంబర్ వద్ద వేరు చేయబడ్డాయి. ప్రయోగ వాహనం నుండి వేరు చేయబడిన క్రూయిజ్ వాహనం ప్రణాళిక ప్రకారం గాలి తీసుకోవడం ప్రారంభించబడింది. హైపర్సోనిక్ విధానంలో దహనం కొనసాగింది మరియు క్రూయిజ్ వాహనం దాని నిర్ధేశించిన విమాన మార్గంలో ధ్వని వేగం కంటే ఆరు రెట్లు వేగంతో దూసుకుపోయింది. అంటే సెకనుకు 02 కి.మీ. వేగంతో దాదాపు 20 సెకన్ల కంటే ఎక్కవగా సమయం ప్రయాణించింది. ఇంధన ఇంజెక్షన్ మరియు స్క్రామ్‌జెట్ యొక్క ఆటో జ్వలన వంటి క్లిష్టమైన సంఘటనలు సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించాయి. స్క్రామ్‌జెట్ ఇంజిన్ టెక్స్ట్ బుక్ పద్ధతిలో ప్రదర్శించబడింది. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌తో సహా క్రూయిజ్ వాహనానికి చెందిన వివిధ పారామితులను బహుళ ట్రాకింగ్ రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్ మరియు టెలిమెట్రీ స్టేషన్లు నుంచి పర్యవేక్షించారు. స్క్రామ్‌జెట్ ఇంజిన్ అధిక డైనమిక్ పీడనం వద్ద మరియు చాలా అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేసింది. హైపర్సోనిక్ వాహనం క్రూయిజ్ దశలో పనితీరును పర్యవేక్షించడానికి బంగాళాఖాతంలో ఒక ఓడను నియమించారు. అన్ని పనితీరు పారామితులు మిషన్ యొక్క అద్భుతమైన విజయాన్ని సూచించాయి. ఈ విజయవంతమైన ప్రదర్శనతో హైపర్సోనిక్ మాన్యువర్ల కోసం ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్, జ్వలన కోసం స్క్రామ్‌జెట్ ప్రొపల్షన్ వాడకం, హైపర్సోనిక్ ప్రవాహం వద్ద నిరంతర దహనం, అధిక ఉష్ణోగ్రత పదార్థాల థర్మో -స్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్‌తో పాటు హైపర్సోనిక్ వేగాల్లో విభజన విధానం మొదలైన వంటి పలు రకాల క్లిష్టమైన సాంకేతికతలు నిరూపించబడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఆత్మనిర్భర్ భారత్' దృష్టిని సాకారం చేసేలా ఈ మైలురాయి సాధించినందుకు రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ డీఆర్‌డీఓను అభినందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శాస్త్రవేత్తలతో మాట్లాడిన ఆయన ఈ అరుదైన ఘనత సాధించినందుకు వారిని అభినందించారు. భారతదేశం వారిని చూసి గర్వపడుతుందని అన్నారు. రక్షణ శాఖ ఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి హెచ్‌ఎస్‌టీడీవీ మిషన్‌కు సంబంధించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు ఇతర సిబ్బందిని అభినందించారు. ఈ విజయవంతమైన ప్రదర్శన దేశం హైపర్సోనిక్ పాలనలో అధునాతనమైన హైపర్సోనిక్ వాహనాలకు మార్గం సుగమం చేస్తుంది.
***
(Release ID: 1652166)
Visitor Counter : 345