రైల్వే మంత్రిత్వ శాఖ
వేగం పుంజుకున్న సరకు రవాణా కారిడార్
పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న
భూభాగాల సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు సంబంధితులు అందరితే వారం వారం సమీక్షా సమావేశాలు
అమలులో క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి
కాంట్రాక్టర్లకు అండగా నిపుణులను అందించిన రైల్వేలు
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2020 4:22PM by PIB Hyderabad
భారత రైల్వేలు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ను వేగవంతం చేసింది. సంబంధితులందరితోనూ వారం వారం సమీక్షాసమావేశాలు జరపటం ద్వారా భూసేకరణలో అక్కడక్కడా మిగిలిపోయిఎంతోకాలంగా ఇబ్బందికరంగా తయారైన సమస్యలను కొలిక్కి తీసుకువచ్చే పని చేపట్టింది. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు తోడుగా ఉండి తగిన క్షేత్రస్థాయిలో రోజువారీ ఎదురయ్యే సమస్యల పరిష్కారం దిశలో సాయం అందించేందుకు నిపుణులను కూడా భారతీయ రైల్వేలు కేటాయించింది.
కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పియూష్ గోయల్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి పురోగతిని సమీక్షించారు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్ పనుల్లో ఎదురవుతున్న అవరోధాలను అడిగి తెలుసుకోవటంతోబాటు వాటి పరిష్కారాలమీద ప్రధానంగా దృష్టి సారించారు. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్,బీహార్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి ఈ అంశాలతో లేఖలు కూడా రాశారు. కారిడార్ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు కాంట్రాక్టర్లతో కూడా సమావేశంలో మాట్లాడారు.
రైల్వే బోర్డు చైర్మన్, ఛీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ కూడా రాష్ట్ర ప్రభుయ్త్వాల ప్రధాన కార్యదర్శులకు, జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లకు లేఖలు రాశారు. పురోగతిని తెలుసుకోవటంతోబాటు కీలకమైన సమస్యల పరిష్కారం దిశగా ఈ లేఖలు రాశారు. కారిడార్ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు కాంట్రాక్టర్లతో కూడా సమావేశం నిర్వహించారు.
కాంట్రాక్టు పాకేజీల వారీగా గత వారం 20 కి పైగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎల్ అండ్ టి., పి ఎం సి, టాటా, డిఎఫ్ సి సంస్థల ఫీల్డ్ ఆఫీసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. వివిధ అంశాలను చర్చించటంతోబాటు వాటిని పూర్తి చేయటానికి గడువు కూడా నిర్దేశించారు.
ప్రాజెక్టులో ఒక్కో కిలోమీటర్ పురోగతినీ పర్యవేక్షించటానికి డాష్ బోర్డ్ కూడా రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు.జోనల్ రైల్వేలు/కాంట్రాక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించి పరిష్కరించేందుకు ఓపెన్ హౌస్ వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు.
ప్రాజెక్టు ప్రయోజనం దృష్ట్యా కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం గతవారం ఇలా సాగింది:
• జిసిసి క్లాజుకు అనుగుణంగా కోవిడ్ -19 సహాయం కింద బకాయి
ఎంతమాత్రమూ లేకుండా చెల్లింపులు జరపటం
• జిఎస్టీ చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయటం
• క్షేత్ర స్థాయిలో పనులు జరగటానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సూపర్ వైజర్ల
కేటాయింపు
రైల్వే అండర్ బ్రిడ్జిలు. ఓవర్ బ్రిడ్జిల కోసం భూసేకరణ సమస్యలు, భూ యాజమాన్యం మార్పిడి, హై టెన్షన్ లైన్ నిర్మాణానికి భూ సమస్య, ప్రైవేట్ భూమి పంపిణీ, భూమికి పరిహారం లెక్కింపు లాంటి సమస్యలకు పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట ప్రభుత్వాలతో మాట్లాడి గతవారంలోనే పరిష్కారం కనుక్కున్నారు. దీనివలన సరకు రవాణాకు ప్రత్యేకంగా నిర్దేశించిన కారిడార్ పనులు వేగవంతమవుతాయి.
***
(రిలీజ్ ఐడి: 1652083)
సందర్శకుల సూచీ సంఖ్య : : 207