రైల్వే మంత్రిత్వ శాఖ

గత సంవత్సరం ఈ సమయంతో పోలిస్తే ఈ సంవత్సరం 10% ఎక్కువ రవాణా బాడుగను గడించిన రైల్వేలు

రైల్వేలు గత సంవత్సరం ఈ సమయంలో సరుకు రవాణా ద్వారా ఆర్జించిన ఆదాయంతో పోలిస్తే ఈ సంవత్సరం సరుకు రవాణా ద్వారా ఆర్జించిన ఆదాయం ఎక్కువ

సరుకు ఎక్కించడం మరియు ఆర్థికంగా కూడా 6 సెప్టెంబర్ 2020 నాటికి గత సంవత్సరం ఈ సంమయంలో ఆర్జించిన ఆదాయంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ నెల ఆదాయం ఎక్కువ

గత సంవత్సరం ఈ సమయంలో సరుకు ఎక్కిచండంతో పోలిస్తే ఈ సంవత్సరం అదే సమయానికి సరుకు ఎక్కించడం 10% ఎక్కువ కాగా అదే విధంగా రు. 129.68 కోట్లు ఎక్కువ ఆర్జించిన రైల్వే

గత సంవత్సరం సెప్టెంబర్ మాసంతో పోలిస్తే సెప్టెంబర్ మాసానికి సంబంధించి 6 సెప్టెంబర్ 2020 నాటికి 19.19 మిలియన్ టన్నులు అనగా 10.41%(1.81 మిలియన్ టన్నుల) సరుకును ఎక్కించిన భారతీయ రైల్వే

రైల్వే ద్వారా సరుకు రవాణాను పెంచడం కొరకు ఎక్కువ రాయితీల కల్పన

Posted On: 07 SEP 2020 3:04PM by PIB Hyderabad

గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో సరుకు రవాణా ద్వారా  భారతీయ రైల్వేలు ఆర్జించిన ఆదాయం కంటే ఈ సంవత్సరం అదే సమయంలో 6 సెప్టెంబర్ 2020 నాటికి ఆర్జించిన ఆదాయం 10.41% ఎక్కువ.  గత సవత్సరం  సెప్టెంబర్ మాసంలో 17.38 టన్నుల సరుకు రవాణా జరుగగా ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసం 6 సెప్టెంబర్ 2020 నాటికి 19.19 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. దీని ద్వారా గత సంవత్సరం ఇదే సమయంలో రు.1706.47 కోట్లు ఆర్జించగా ఈ సంవత్సరం రు.1836.15 కోట్లు  అనగా రు.129.68 కోట్లు ఎక్కువ మొత్తాన్ని ఆర్జించింది.

సెప్టెంబర్ మాసానికి సంబంధించి 6 సెప్టెంబర్ 2020 నాటికి 19.19 మిలియన్ టన్నులు సరుకును ఎక్కించగా అందులో 8.11 మిలియన్ టన్నుల బొగ్గు, 2.59 మిలియన్ టన్నుల  ముడి ఇనుము, 1.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 1.03మిలియన్ టన్నుల ఎరువులు మరియు 1.05 మిలియన్ టన్నుల సిమెంటు(క్లింకర్ కాకుండా) ఉన్నాయి.

సరుకు రవాణాను పెంచడానికి భారతీయ రైల్వే వివిధ రాయితీలను ప్రకటించింది.  కొవిడ్-19ను ఒక అవకాశంగా మలచుకుని అన్నిరకాలుగా సామర్థ్యాలను పెంచుకుంది భారతీయ రైల్వే.

***



(Release ID: 1652062) Visitor Counter : 175