హోం మంత్రిత్వ శాఖ

పోషకాహార లోపం లేని భారత్‌ కోసం ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని, పాల్గొనాలని "రాష్ట్రీయ పోషణ మాహ్‌" సందర్భంగా పిలుపునిచ్చిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా

చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు తగిన పోషకాహారం అందించడం ప్రధాని మోదీ ప్రాధాన్యతాంశం: అమిత్‌ షా

2018లో ప్రారంభమై, దేశం నుంచి పోషకాహార లోపాన్ని పారదోలడంలో అద్భుత పాత్ర పోషిస్తున్న గొప్ప పథకం పోషన్ అభియాన్: అమిత్‌ షా

తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సంపూర్ణ పోషణ అందించేందుకు ఈనెలలో దేశవ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది: అమిత్‌ షా

Posted On: 07 SEP 2020 2:23PM by PIB Hyderabad

పోషకాహార లోపం లేని భారత్‌ కోసం అంతా ప్రతిజ్ఞ చేయాలని, కేంద్రం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని "రాష్ట్రీయ పోషణ మాహ్‌" సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా ప్రజలకు పిలుపునిచ్చారు. చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సంపూర్ణ పోషకాహారం అందించడం ప్రధాని మోదీకి ఎప్పుడూ ప్రాధాన్యతాంశమని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.
 
    2018లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన పోషన్ అభియాన్, దేశం నుంచి పోషకాహార లోపాన్ని తరిమికొట్టడంలో అద్భుత పాత్ర పోషిస్తోందని అమిత్‌ షా పేర్కొన్నారు. తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సంపూర్ణ పోషణ అందించేందుకు ఈ నెలలో దేశవ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అమిత్‌ షా వెల్లడించారు. ఈ పథకాన్ని బలోపేతం చేసేందుకు పోషకాహార లోపం లేని భారత్‌ కోసం ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు.

    రాష్ట్రీయ పోషణ్‌ మాహ్‌ను ఈనెలలో నిర్వహిస్తున్నారు. చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి, వారిని ఆరోగ్యంగా ఉంచడం ఈ కార్యక్రమ లక్ష్యం.

***
 



(Release ID: 1651965) Visitor Counter : 216