వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సంస్కరణల కార్యాచరణప్రణాళిక అమలు ఆధారంగా 2019 సంవత్సరానికి రాష్ట్రాల ర్యాంకుల ప్రకటన.
రాష్ట్రాల సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2019 లో ఉన్నత స్థానంలో ఉన్న రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ.
రాష్ట్ర ర్యాంకింగ్‌లు పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆరోగ్యకరమైన పోటీకి, ప్రతి రాష్ట్రంలో సులభతర వాణిజ్యపెంపునకు దోహదపడనున్నాయి.
Posted On:
05 SEP 2020 5:53PM by PIB Hyderabad
కేంద్ర ఆర్దిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల ర్యాంకింగ్ కు సంబంధించి వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిఆర్ఎపి) ను 05-09-2020న ప్రకటించారు.
ఈ ర్యాంకులను కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, కేంద్ర హౌసింగ్ , పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి (స్వతంత్ర) శ్రీ హర్దీప్ సింగ్ పూరి, వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయమంత్రి (స్వతంత్ర) శ్రీ సోమ్ ప్రకాశ్, ఉత్తరాఖండ్, త్రిపుర ముఖ్యమంత్రులు, జమ్ముకాశ్మీర్, లద్దాక్ ల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు సీనియర్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలు ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించడం 2015 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పటివరకు 2015,2016,2017-18 సంవత్సరాలకు ర్యాంకులు విడుదలయ్యాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2018-19 లో 180 సంస్కరణలకు సంబంధించిన అంశాలు , 12 వ్యాపార రెగ్యులేటరీకి సంబంధించినవి ఉంటాయి. సమాచార అందుబాటు, సింగిల్ విండో వ్యవస్థ, కార్మికులు, పర్యావరణం తదితరాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి.
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలు పనితీరు ఆధారంగా , రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చే వ్యవస్థ ద్వారా ఆరోగ్య కరమైన పోటీని ప్రవేశపెట్టి, పెట్టుబడులను ఆకర్షించడం, సులభతర వాణిజ్యాన్ని ప్రతి రాష్ట్రంలో పెంపొందింప చేయడం దీని విస్తృత లక్ష్యం. ఈసారి ర్యాంకింగ్‌లు ఇవ్వడంలో క్షేత్రస్థాయిలో 30 వేల మంది నుంచి వచ్చిన స్పందనకు పూర్తి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. వారు ఈ సంస్కరణల క్రియాశీలతపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వడం వల్ల అవి పెట్టుబడులను ఆకర్షించగలుగుతాయి. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ సులభతర వాణిజ్యానికి ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది.
“ ఇండియా ,సంస్కరణల ప్రక్రియను ఎంతో కీలకమైనదిగా పరిగణిస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో దేశంలొ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్ డౌన్ ని కూడా దేశంలొ విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయి. కొన్నిరాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళిక అమలులో అత్యద్భుత పనితీరును కనబరుస్తున్నాయి. రాష్ట్రాలు వ్యాపార కార్యాచరణ ప్రణాళిక వెనుక ఉన్న వాస్తవ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నాయి.” అని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.
“ సులభతర వాణిజ్యం ర్యాంకింగ్‌లు ఈరోజు విడుదల చేయడం జరుగుతోంది. ఇది రాష్ట్రాల కృషికి దర్ఫణం .ర్యాంకింగ్‌లు పోటీతత్వంతో కూడినవి. రాష్ట్రాలకు ప్రత్యేకంగా ర్యాంకింగ్‌లు కలిగిన కొద్ది దేశాలలో ఇండియా ఒకటి. ఇవి దేశ ర్యాంకింగ్‌ను మెరుగుపరచడానికి పనికివస్తాయి. ” అని ఈ కార్యక్రమం సందర్భంగా పియూష్ గోయల్ తెలిపారు.
“
లైసెన్సుల పునరుద్ధరణను తొలగించడం లేదా వాటి రెన్యువల్‌ల ను పొడిగించడం , దరఖాస్తు ఫారాలను సరళీకృతం చేయడం, రిస్క్-ఆధారిత తనిఖీలను ప్రవేశపెట్టడం లేదా తృతీయ పార్టీ తనిఖీలను ప్రవేశపెట్టడం, ఆమోదాలను డిజిటలైజ్ చేయడం ,రెగ్యులేటరీ వ్యవస్థను హేతుబద్ధీకరించడానికి చర్యలు చేపట్టడంవంటి వాటి ద్వారా రెగ్యులేటరీ భారాన్ని తగ్గించే చర్యలను చేపట్టాలని రాష్ట్రాలను కోరుతున్నాను.,” అని శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు
సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019 కింద ఎంపికైన మొదటి పది రాష్ట్రాలు:
ఆంధ్రప్రదేశ్
ఉత్తరప్రదేశ్
తెలంగాణ
మధ్యప్రదేశ్
జార్ఖండ్
ఛత్తీస్‌ఘడ్
హిమాచల్ ప్రదేశ్
రాజస్థాన్
పశ్చిమబెంగాల్
గుజరాత్
రాష్ట్రాల ర్యాంకింగ్‌లు: రాష్ట్ర బిఆర్ ఎ పి 2019
******
(Release ID: 1651756)
Visitor Counter : 266