శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొత్త హైబ్రిడ్ స్టెరిలైజేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో పోర్టబుల్ స్టెరిలైజేషన్ యూనిట్ పిపిఇని వేగంగా ప్రక్షాళన చేస్తుంది

Posted On: 04 SEP 2020 7:20PM by PIB Hyderabad

కోవిడ్-19ను సులభంగా, వేగంగా ఎదుర్కోవటానికి కవచాలుగా ఉన్న వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈలు) ప్రక్షాళన చేయగల పరికరం అందుబాటులోకి రాబోతోంది. హైబ్రిడ్ స్టెరిలైజేషన్ సిస్టమ్ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు పోర్టబుల్ స్టెరిలైజేషన్ యూనిట్‌ను అభివృద్ధి చేశారు, దీనితో ఆ పీపీఈ లను పలు మార్లు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దీనిని ఆరోగ్య నిపుణులు ఉపయోగించవచ్చు, పీపీఈ లు తప్పనిసరిగా వినియోగించే ఇతర కోవిడ్ యోధులు పీపీఈల నుండి ప్రమాదకర ఘన వ్యర్థాల ఉత్పత్తిని నిరోధించవచ్చు.

ఐఐటి తిరుపతి (ఐఐటిటి), ఐసెర్-తిరుపతి సంయుక్తంగా పోర్టబుల్ ఆప్టికల్ కుహరాన్ని అభివృద్ధి చేశారు

వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇలు), ఇతర గృహ వస్తువుల సమర్థవంతమైన, వేగవంతమైన ప్రక్షాళనకు స్టెరిలైజేషన్ యూనిట్ (పోస్కు) ఉపయోగపడుతుంది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్ఈఆర్బి) సహకారంతో వర్కింగ్ పాయింట్-ఆఫ్-యూజ్ స్టెరిలైజేషన్ యూనిట్ అభివృద్ధి చేయబడింది, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) క్రింద ఒక చట్టబద్దమైన సంస్థ.

స్టెరిలైజషన్ కి యు.వి రేడియేషన్ పధ్ధతి నిరూపితమైంది. అయితే ఈ కిరణ పుంజం ఏకరీతిలో వస్తువు అంతా వ్యాపించదు.

డాక్టర్ రీతేష్ కుమార్ గంగ్వార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజిక్స్), డాక్టర్ అరిజిత్ శర్మ (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజిక్స్), డాక్టర్ శిహాబుధీన్ ఎం. మలియెక్కల్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ & ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్)తో కూడిన  ఐఐటిటి బృందం యు.వి రేడియేషన్ కుహరం, కోల్డ్ ప్లాస్మా, H2O2 స్ప్రేలతో కూడిన ఈ హైబ్రిడ్ స్టెరిలైజేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అయితే సాంప్రదాయ యు.వి వ్యవస్థల మాదిరిగా కాకుండా, ఈ యూనిట్ చికిత్స ప్రాంతంలో ఫోటాన్ ఫ్లక్స్ వాడకాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఆప్టికల్ కావిటీ భావనను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థ యు.వి రేడియేషన్‌ను పరిమితం చేస్తుంది, ఫోటాన్-ఫ్లక్స్, స్టెరిలైజేషన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. యు.వి-సి, కోల్డ్ ప్లాస్మా, H2O2 స్ప్రేల పొందికైన ఆపరేషన్ మరింత హైడ్రాక్సిల్ రాడికల్ ఉత్పత్తి కారణంగా స్టెరిలైజేషన్ సామర్థ్యాన్ని మరింత బలపరుస్తుంది.

ఐసెర్ - తిరుపతికి చెందిన డాక్టర్ వసుధ రాణి దేవనాథన్ పోర్టబుల్ యూనిట్ క్రిమిరహితం చేసే సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఐఐటిటి బృందానికి సహాయం చేస్తారు. తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఆర్. జయప్రద (ఎండి మైక్రోబయాలజీ) కూడా ఆస్పత్రి మైక్రోబయాలజీ ప్రయోగశాలలో ఈ కొత్త ఆవిష్కరణ ప్రభావాన్ని పరీక్షిస్తారు. ఈ బృందం ప్రస్తుతం యు.వి మోతాదు, ప్లాస్మా,  H2O2  తో సహా డిజైన్ పారామితులను ఆప్టిమైజ్ చేస్తోంది. 2 నిమిషాల కన్నా తక్కువ సమయంలో స్టెరిలైజేషన్ చేస్తుంది. చికిత్స, నాన్-థర్మల్ స్వభావం కారణంగా, ప్రతిపాదిత యూనిట్ ప్యాక్ చేసిన, ప్యాక్ చేయని ఆహారం, కరెన్సీ నోట్లు, ఇతర గృహ వస్తువులు, ఇతర వస్తువులను క్రిమిరహితం చేయడంలో కూడా ఇది పనిచేస్తుంది. 

మరింత సమాచారం కోసం  : డాక్టర్ రీతేష్ కుమార్ గంగ్వార్, ఐఐటి తిరుపతిని సంప్రదించవచ్చు,   reetesh@iittp.ac.in, Mob: 8018119014

The schematic design of the sterilization unit, along with the contributors Dr. Reetesh Kumar Gangwar (top, left), Dr. Arijt Sharma (bottom, left), Dr. Shihabudheen M. Maliyekkal (top, right), and Dr. VasudharaniDevanathan (bottom, right).

 

*****



(Release ID: 1651501) Visitor Counter : 217