రక్షణ మంత్రిత్వ శాఖ
లద్దాఖ్‌లో పర్యటించిన భారత సైనిక దళం ఆర్మీ స్టాఫ్ చీఫ్
Posted On:
04 SEP 2020 6:31PM by PIB Hyderabad
భారత సైనిక దళం ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎం.ఎం. నర్‌వణే తన రెండు రోజుల లేహ్ పర్యటనను ముగించారు. ఆయప ఈ నెల 3వ తేదీన లేహ్ చేరుకున్నారు. ఎల్ఏసీ వెంబడ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గాను ఆయన లేహ్‌ను నుంచి ముందుకు సాగుతూ పలు ప్రాంతాలలో పర్యటించారు. కష్టతరమైన హై ఆల్టిట్యూడ్ ఫార్వర్డ్ ప్రాంతాలలో మోహరించిన సైనికులు మరియు స్థానిక కమాండర్లతో శ్రీ నర్‌వణే సంభాషించారు. మన సొంత ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు యూనిట్లు ప్రదర్శిస్తున్న మేటి ధైర్యాన్ని, వృత్తి నైపుణ్యం యొక్క ప్రమాణాలను ఆయన ప్రశంసించారు. అన్ని ర్యాంకులు అప్రమత్తంగా ఉండాలని, కార్యాచరణ సంసిద్ధతను మేటిగా కొనసాగించాలని కోరారు. ఆ తరువాత లేహ్ వద్ద నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కామాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకె జోషి, ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ విభాగ జీఓసీ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్‌లు శీతాకాలం నేపథ్యంలో కార్యాచరణ సంసిద్ధత స్థితి గురించి మరియు బలగాల పెంపకం కోసం అవసరమైన ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించారు. కార్యాచరణ ప్రభావం, శక్తుల సామర్థ్యాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలపై శ్రీ నర్‌వణే తన సంతృప్తి వ్యక్తం చేశారు.
***
(Release ID: 1651440)
Visitor Counter : 161