సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో భేటీ అయిన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్

Posted On: 03 SEP 2020 7:34PM by PIB Hyderabad

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కె మాథుర్ ఈ రోజు కేంద్ర విదేశాంగ (ఇండిపెండెంట్ ఛార్జ్), ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డోనెర్), పిఎంఓ, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమై కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన సమస్యలు విస్తృతంగా  చర్చించారు. ఈ సందర్బంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, లడఖ్, ఆ పరిధిలో ఉన్న ప్రాంతాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలోనే తొలిసారిగా లడఖ్‌కు విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు.

సి.ఎస్.ఐ.ఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే త్వరలో మాథుర్‌ను కలుసుకుని, ప్రఖ్యాత లడఖ్ పండ్లలో వ్యాపారాన్నిముఖ్యంగా  "లడఖ్ బెర్రీ" అని పిలువబడే ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ప్రాసెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక గురించి చర్చిస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.

 

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విధంగా “కార్బన్ న్యూట్రల్” లడఖ్ కోసం విధానం, కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం గురించి శ్రీ మాథుర్, డాక్టర్ జితేంద్ర సింగ్ కి తాజా పరిస్థితిని వివరించారు. సమగ్ర ప్రణాళికపై కేంద్ర పాలిత ప్రాంతం చిత్తశుద్ధితో పనిచేస్తోందని త్వరలోనే ఇది ఉన్నతాధికారుల ముందు ఉంచడానికి సిద్ధంఅవుతోందని ఆయన మంత్రికి తెలియజేశారు. "లడఖ్ విజన్ 2050" పేరుతో కార్యాచరణ ప్రణాళిక గురించి కూడా అప్ డేట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ లడఖ్ కోసం రూ.50 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా ప్రస్తావించారు, ఈ ప్రాంతం ప్రాజెక్టుల కోసం వివిధ కేంద్ర నిధుల కేటాయింపు విషయంలో ఇంత ఉదారంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి అని అన్నారు. లడఖ్ ప్రాంతానికి ప్రత్యేకంగా అంకితం చేసిన ఈ రకమైన రోడ్‌మ్యాప్‌లో ఇది మొదటిది అని లెఫ్టినెంట్ గవర్నర్  వివరించారు. ఇందుకు తన పూర్తి మద్దతు ఇస్తూ కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో లడఖ్ సంబంధిత విషయాలను చేపట్టడంలో రోజువారీ సమన్వయం చేస్తున్న కేంద్రమంత్రి డాక్టర్ సింగ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

                                                                                              *******


(Release ID: 1651154) Visitor Counter : 195