భారత పోటీ ప్రోత్సాహక సంఘం
క్లారియంట్ఏజీ సంస్థలో ఇంక్రిమెంటల్ ఎక్విజిషన్ ప్రాతిపదికన సాబిక్ బీవీ వాటా కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆమోదం
Posted On:
03 SEP 2020 5:12PM by PIB Hyderabad
క్లారియంట్ఏజీ సంస్థలో సాబిక్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్ బి.వి. (సాబిక్ బీవీ) ఇంక్రిమెంటల్ ఎక్విజిషన్ ప్రాతిపదిన వాటాను కొనుగోలు చేసేందుకు గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. కాంపిటీషన్ చట్టం, 2002 లోని.. సెక్షన్ 31 (1) ప్రకారం ఈ నెల 2వ తేదీన సీసీఐ తన ఆమోదం తెలిపింది. క్లారియంట్ ఏజిలో 6.51 శాతం వాటాకు (ప్రతిపాదిత కాంబినేషన్) సాబిక్ బీవీ (సౌదీ బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (సాబిక్) యొక్క పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) సీసీఐకి ఒక ప్రతిపాదన సమర్పించింది. సాబిక్ అనే సంస్థ సౌదీ అరేబియా ప్రభుత్వం యొక్క రాయల్ డిక్రీచే స్థాపించబడింది. ఇది సౌదీలోని స్టాక్ ఎక్స్ఛేంజ్లో అధికారికంగా లిస్ట్ చేయబడింది. 50 కి పైగా దేశాలలో తన కార్యకలాపాలు కలిగి ఉంది. సాబిక్ బీవీ అనేది సాబిక్ యొక్క అంతర్జాతీయ కార్యకలాపాల హోల్డింగ్ సంస్థ, దీని ద్వారా సాబిక్ ప్రత్యేక రంగాలలో పెట్టుబడులు పెట్టింది. పెట్రోకెమికల్స్, అగ్రి-న్యూట్రియంట్స్, లోహాలు మరియు ప్రత్యేక పదార్థాలు వంటి ప్రధానంగా చురుకుగా ఉండే నాలుగు ఉత్పత్తి విభాగాలలో సాబిక్ తన కార్యకలాపాలను కలిగి ఉంది. క్లారియంట్ ఏజి అనేది ముట్టెంజ్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన స్విస్ రసాయనాల సంస్థ. ఇది స్విస్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయబడింది. ఇది ప్రత్యేక రసాయనాల ఉత్పత్తి మరియు ప్రపంచవ్యాప్తంగా పంపిణీలో చురుకుగా వ్యవహరిస్తోంది. వ్యక్తిగత సంరక్షణ, చమురు, మైనింగ్, పంట పరిష్కారాలు మరియు పారిశ్రామిక అనువర్తనాలతో సహా వివిధ రంగాలకు క్లారియంట్ తన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. చట్టం యొక్క సెక్షన్ 43ఏ కింద విచారణకు ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ ప్రతిపాదనకు సీసీఐ తన ఆమోదం తెలిపింది.
దీనికి సంబంధించి సీసీఐ యొక్క వివరణాత్మక అర్డరు వెలువడాల్సి ఉంది.
(Release ID: 1651122)
Visitor Counter : 164